Mukhtar Abbas Naqvi: ఉపరాష్ట్రపతి రేసులో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ..?

X
By - Divya Reddy |6 July 2022 5:31 PM IST
Mukhtar Abbas Naqvi: బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఉపరాష్ట్రపతి రేసులో నిలవనున్నారా..?
Mukhtar Abbas Naqvi:బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.. ఉపరాష్ట్రపతి రేసులో నిలవనున్నారా..? ఎన్డీయే తరఫున ఆయనే అభ్యర్థిగా ఉంటారా..? ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే ఇదే నిజమని తెలుస్తోంది. ఇవాళ్టి కేంద్ర కేబినెట్ సమావేశానికి హాజరైన ఆయన.. సమావేశం అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మోదీని కలిసి తన రాజీనామా సమర్పించారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం కూడా రేపటితో ముగియనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com