Airport Drug Bust: 40 కేజీల విదేశీ గంజాయి సీజ్..! విలువ రూ.40 కోట్ల పైమాటే

గంజాయి స్మగ్లర్స్ రోజురోజుకి రెచ్చిపోతున్నారు. ఇందుకు నిదర్శనం తాజాగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి ముంబయికి వచ్చిన ప్రయాణికులపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కస్టమ్స్ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏకంగా రూ.40 కోట్ల విలువైన 40 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
వివరాల్లోకి వెళ్తే… బ్యాంకాక్ నుంచి వచ్చిన 9 మంది స్మగ్లర్లు గంజాయిని లగేజ్ బ్యాగుల్లో దాచి అక్రమంగా తరలించే యత్నం చేశారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో లగేజ్ బ్యాగుల్లో దాచిన భారీ మొత్తంలో విదేశీ గంజాయి బయటపడింది. వెంటనే గంజాయిని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేపట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కేజీల విదేశీ గంజాయి పట్టుబడటంతో ముంబయి విమానాశ్రయంలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేసినట్లు అధికారులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

