Hafiz Saeed Sentence : హఫీజ్ సయీద్‌కు 78ఏళ్ల శిక్ష

కరుడుగట్టిన ఉగ్రవాది, జమాత్- ఉద్- దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ పాకిస్థాన్ జైల్లో 78 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాడనే 7 కేసుల్లో దోషిగా తేలడం వల్ల పాకిస్థాన్ న్యాయస్థానం అతడికి 78 ఏళ్ల జైలు శిక్షను విధించినట్లు వెల్లడించింది.
ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, జమాత్- ఉద్- దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్ పాకిస్థాన్ జైల్లో 78 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉగ్ర సంస్థలకు నిధుల సమకూరుస్తున్నాడనే 7 కేసుల్లో దోషిగా తేలడం వల్ల పాకిస్థాన్ న్యాయస్థానం అతడికి 78 ఏళ్ల జైలు శిక్షను విధించినట్లు తెలిపింది. 2008 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి-1267 ఆంక్షల కమిటీ, హఫీజ్ సయీదన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. పాకిస్థాన్ ప్రభుత్వం నిర్బంధంలో ఉన్న అతడు, 2020 ఫిబ్రవరి 12 నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ తన సవరించిన ఎంట్రీలో పేర్కొంది.
గత నెలలో సెక్యూరిటీ కౌన్సిల్ కమిటీ అల్-ఖైదా ఆంక్షల జాబితాలోని వ్యక్తులు, సంస్థలపై కొన్ని రికార్డులకు సవరణలు చేసింది. లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, సయీద్ డిప్యూటీ అయిన హఫీజ్ భుట్టావి మరణించినట్లు ధృవీకరణ జరిగిందని UN తెలిపింది. ఉగ్రవాద నిధుల కేసులో శిక్ష అనుభవిస్తూ గతేడాది మేలో పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ జైలులో అతడు మరణించాడని చెప్పింది. ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాది సయీద్ను తమకు అప్పగించాలని డిసెంబర్లో పాకిస్థాన్ను భారత్ కోరింది. అతను పలు ఉగ్రవాద కేసుల్లో భారత దర్యాప్తు సంస్థలకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. ఉగ్రవాది హఫీజ్ ఆస్తుల స్తంభన, ప్రయాణ నిషేధం, ఆయుధాలపై ఆంక్షలను భద్రతా మండలి విధించింది. లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు సయీద్ డిప్యూటీ హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావిలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com