Mumbai Businesswoman: ముంబైలో మహిళా వ్యాపారవేత్తపై ఫార్మా కంపెనీ ఎండీ లైంగిక వేధింపులు

Mumbai Businesswoman: ముంబైలో  మహిళా వ్యాపారవేత్తపై ఫార్మా కంపెనీ ఎండీ లైంగిక వేధింపులు
X
బెదిరించి నగ్నంగా మార్చినట్టు ఆరోపణ

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సమావేశానికి పిలిచి ఓ మహిళా వ్యాపారవేత్త పట్ల అతి దారుణంగా వ్యవహరించాడో ప్రైవేటు కంపెనీ ఎండీ. తుపాకీతో బెదిరించి ఆమెను వివస్త్రగా మార్చి వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ముంబైకి చెందిన 51 ఏళ్ల మహిళా వ్యాపారవేత్తపై ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, వ్యవస్థాపక సభ్యుడు జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఓ సమావేశం పేరుతో పాస్కల్ తనను ఫార్మా కంపెనీ కార్యాలయానికి పిలిపించారు. అక్కడికి వెళ్ళాక, ప్రాణాలు తీస్తానని బెదిరించి దుస్తులు విప్పాలని బలవంతం చేశారు.

ఆమె నిస్సహాయ స్థితిలో ఉండగా, నిందితుడు అసభ్య పదజాలంతో దూషిస్తూ తన నగ్న ఫోటోలు, వీడియోలు చిత్రీకరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ వీడియోలను బహిర్గతం చేస్తానని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులపై లైంగిక వేధింపులు, దాడి, క్రిమినల్ బెదిరింపుల కింద అభియోగాలు మోపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు, ఈ ఘటనలో నిందితుల పాత్రపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story