మేకలను ఇంటికి తీసుకు వచ్చిన వ్యక్తి.. హనుమాన్ చాలీసా పఠించిన అపార్ట్ మెంట్ వాసులు

బక్రీద్ సందర్భంగా ఓ ముస్లిం వ్యక్తి తన ఇంటికి మేకలను తీసుకురావడంతో ముంబైలోని రెసిడెన్షియల్ సొసైటీ సభ్యులు నిరసనకు దిగారు. పోలీసులను రప్పించడంతో వివాదం సద్దుమణిగింది. ముంబైలోని మీరా రోడ్‌లోని హౌసింగ్ సొసైటీలోని ఇతర నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రెసిడెన్షియల్ సొసైటీలో దాదాపు 200-250 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయని షేక్ తెలిపారు. రెసిడెన్షియల్ సొసైటీ బిల్డర్ ప్రతి సంవత్సరం మేకలను ఉంచడానికి వారికి కొంత స్థలాన్ని కేటాయించారు. అయితే ఈ సంవత్సరం బిల్డర్ నిరాకరించాడు. రెసిడెన్షియల్ సొసైటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపాడు. మేకలను ఇంటికి తీసుకురావడానికి తమకు అనుమతి నిరాకరించిందని ఆయన ఆరోపించారు. సొసైటీ ఆవరణలో జంతువులను బలి ఇచ్చే ఆలోచన తమకు లేదని అన్నారు.
వివాదాన్ని పరిష్కరించేందుకు పోలీసులు జోక్యం చేసుకుని, నిబంధనల ప్రకారం ప్రాంగణంలో జంతుబలిని అనుమతించబోమని సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే షేక్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అనంతరం షేక్ రెసిడెన్షియల్ సొసైటీ నుంచి మేకలను తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com