Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని హెచ్చరికలు.

Yogi Adityanath:  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామని హెచ్చరికలు.
X
పది రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని వార్నింగ్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తామంటూ ముంబయి పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఎన్సీపీ నేత, మాజీమంత్రి బాబా సిద్ధిఖీలాగా యూపీ సీఎంను కూడా చంపుతాం అంటూ దుండుగులు అందులో వార్నింగ్ ఇచ్చారు. ఆయన పది రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఈ మెసేజ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు.

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత బాబా సిద్దిఖీ గత నెలలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బాంద్రాలో కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్దిఖీ ఆఫీసు ముందు బాబా సిద్దిఖీపై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన సిద్దిఖీ.. ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారు. ఈ హత్యకు పదిహేను రోజుల ముందు సిద్దిఖీకి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. కాగా, సల్మాన్ ఖాన్ కు ఆత్మీయుడు కావడం వల్లే బాబా సిద్దిఖీని హత్య చేశామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సల్మాన్ ఖాన్ ను కూడా తుదముట్టిస్తామని బెదిరించింది. బాబా సిద్దిఖీ కుమారుడు జీశాన్ సిద్దిఖీకి కూడా బెదిరింపులు వచ్చాయి. తాజాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Tags

Next Story