అంధకారంలో చిక్కుకున్న ముంబై మహానగరం

ముంబైలో బ్లాకౌట్ ఏర్పడింది. నగరం అంతా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో.. ఎక్కడిక్కడ అంతటా నిలిచిపోయింది. ముంబై మహానగరం అంధకారంలో చిక్కుకుంది. ఇవాళ ఉదయం నుంచి పలు కీలక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా జరగడంలేదు. దీంతో చాలా చోట్ల లోకల్ రైళ్లు నిలిచిపోయాయి. టాటా నుంచి విద్యుత్ సరపరా స్తంభించినట్టు... బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ పేర్కొంది. చర్చ్‌గేట్ నుంచి వాసాయి రైల్వే స్టేషన్ మధ్య నడిచే లోకల్ రైళ్లు నలిపివేశారు. గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల ఈ సమస్య ఉత్పత్తన్నమైంది. ఉదయాన్నే రవాణా వ్యవస్థ స్తంభించడంతో... ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి కార్యాలయాలకు వెళ్లలేక ఆందోళన చెందుతున్నారు.
ఈ రోజు ఉదయం నుంచే నగర ప్రజలు విద్యుత్ సమస్యపై ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు. సౌత్, సెంట్రల్, నార్త్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్టు సమాచారం. ముంబై మహానగరంలో 400KV లైన్ ట్రిప్ అయినట్టు తెలుస్తోంది. పవర్ గ్రిడ్‌లో సాంకేతిక లోపం వల్ల సమస్య తలెత్తినట్టు సమాచారం. MIDC, పాల్గర్, దహనూ లైన్లలో సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ముంబై నగరానికి వెళుతున్న 360 మెగావాట్ల పవర్ సరఫరాకు అంతరాయం కలిగినట్టు అధికారులు తెలిపారు. BSE, NSEలు మాత్రం.. ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. విద్యుత్ సమస్యతో...ఎలక్ట్రిక్ సరఫరా లేక మెట్రో రైళ్లు కూడా నిలిచిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com