Mumbai Rains:ముంబై ని ముంచెత్తిన భారీ వర్షాలు

భారీ వర్షాలు ఆర్థిక నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 5 రోజులు వర్షాలు కురుస్తాయని.. భారత వాతావరణ విభాగం హెచ్చరించిన కొన్ని గంటలకే భారీ వర్షాలు కురవడం మొదలైంది. ముంబైతోపాటూ పుణె, నాగపూర్‌లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయు. నిన్న సాయంత్రం 5.30 నుంచి మొదలైన వర్షం రాత్రి 8.30 వరకూ కురుస్తూనే ఉంది. ఆ 3 గంటల్లో ముంబైలో 8.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిన్న మొత్తంగా 10 సెంటీమీటర్ల వాన కురవడంతో.. రోడ్లు, కాలనీలు, వీధులన్నీ జలసంద్రాలు అయ్యాయి. IMD ప్రకారం శనివారం రాత్రి 8.30 నాటికి ముంబైలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
నిజానికి ముంబై సముద్ర మట్టానికి సమాంతరంగా ఉంది. అందువల్ల ప్రతీ సంవత్సరం.. సముద్ర మట్టం పెరుగుతూ.. ముంబైని ఆక్రమిస్తోంది. దానికి తోడు ఈ భారీ వర్షాలు ఆ నగరాన్ని ముంచేస్తున్నాయి. అంతే కాక ముంబై లో నిరు పేదలు, కూలీలు, వలస కార్మికులు ఎక్కువ. వారు నివసించే ఇల్లు అంత గొప్పగా ఉండవు అని తెలిసిందే. అందుకే ముంబై వరదలు వచ్చినప్పుడల్లా వారే ఎక్కువ ఇబ్బందులు పడతారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు పడవు అని అంచనా తోనే ఉన్నారు. ఒకవేళ ఇదే విధంగా వర్షాలు కొనసాగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి.
జూన్ 11న రుతుపవనాలు తీరప్రాంతం రత్నగిరికి చేరుకున్నప్పటికీ, బిపర్జాయ్ తుఫాను కారణంగా 10 రోజులు ఆలస్యంగా 23-25 తేదీల మధ్య రుతుపవనాలు నగరంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ ముందుగానే అంచనా వేసింది. కాగా, ఇన్ని రోజులు తీవ్ర ఉక్కపోతకు గురైన నగర వాసులు తాజా వర్షంతో ఉపశమనం పొందుతున్నారు. చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతానికి విమాన, రైల్వే సేవలకు పెద్దగా అంతరాయం లేదు. అయితే భారీ వర్షాలు కొనసాగితే మాత్రం సేవలను తాత్కాలికంగా నిలిపివేసే పరిస్థితి రావచ్చు. నిన్నటి వరకు ఎల్లో అలర్ట్ ఉన్న ముంబై ఈరోజు ఆరంజ్ అలర్ట్ కి మారింది. అంటే మరింత ఎక్కువ వర్షం పడచ్చు అని అంచనా
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com