Mumbai: న్యూ ఇయర్ స్వీట్స్ ఇస్తానంటూ పిలిచి.. ప్రియుడిపై వివాహిత ఘాతుకం

Mumbai:  న్యూ ఇయర్ స్వీట్స్ ఇస్తానంటూ పిలిచి.. ప్రియుడిపై వివాహిత ఘాతుకం
X
పెళ్లికి నిరాకరించిన ప్రియుడిపై మహిళ దాడి

ముంబైలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడన్న కోపంతో ఓ వివాహిత తన ప్రియుడి మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. న్యూ ఇయర్ స్వీట్స్ ఇస్తానని నమ్మించి ఇంటికి పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితురాలు పరారీలో ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 25 ఏళ్ల మహిళకు, 44 ఏళ్ల వ్యక్తికి గత ఆరేడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ బంధువులు కూడా. అయితే, భార్యను వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని నిందితురాలు కొన్నాళ్లుగా ప్రియుడిపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ విషయమై వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆమె ఒత్తిడి భరించలేక బాధితుడు 2025 నవంబర్ లో బిహార్‌లోని తన స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడికి కూడా ఆమె ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడింది.

డిసెంబర్ 19న ముంబైకి తిరిగి వచ్చిన బాధితుడు, ఆమెతో సంబంధాలు తెంచుకుని దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో న్యూ ఇయర్ స్వీట్స్ తీసుకోవడానికి ఇంటికి రావాలని ఆమె అతడిని ఆహ్వానించింది. ఇంట్లోకి వెళ్లాక, అతడిని ప్యాంటు విప్పమని చెప్పి, వంటగది నుంచి కూరగాయలు కోసే కత్తితో వచ్చి మర్మాంగంపై దాడి చేసింది.

తీవ్ర రక్తస్రావంతో గాయపడిన బాధితుడు, అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని మొదట వీఎన్ దేశాయ్ ఆసుపత్రికి, ఆ తర్వాత సియోన్ ఆసుపత్రికి తరలించారు. గాయం చాలా లోతుగా ఉందని, శస్త్రచికిత్స అవసరం కావచ్చని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

Tags

Next Story