Punjab: 16 ఏళ్లకే ముస్లిం అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు

Punjab: 16 ఏళ్లకే ముస్లిం అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు
Punjab: 16 ఏళ్లకే ముస్లిం అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

Punjab: 16 ఏళ్లకే ముస్లిం అమ్మాయిలు పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పఠాన్‌కోట్‌కు చెందిన 16 ఏళ్ల అమ్మాయి, 21 ఏళ్ల అబ్బాయి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వారి ప్రేమను ఇరువురు కుటుంబపెద్దలు అంగీకరించలేదు. దాంతో జూన్ 8న ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తమ ప్రేమపెళ్లిని వ్యతిరేకిస్తున్న కుటుంబసభ్యులు.. తమపై అఘాయిత్యానికి పాల్పడతారేమోనని భయపడ్డారు. తమకు రక్షణ కావాలంటూ కొత్త జంట.. పంజాబ్‌ కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో జస్టిస్ జస్‌జిత్ సింగ్ బేడీ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఇవాళ తీర్పు వెల్లడించింది. 16 ఏళ్లు నిండిన ముస్లిం అమ్మాయి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇస్లామిక్ షరియా చట్టాన్ని తన తీర్పులో ప్రస్తావించిన జస్టిస్ బేడీ.. ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లు పర్సనల్ చట్టం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ముస్లిం పర్సనల్ లా కూడా వీరి పెళ్లిని అంగీకరిస్తుందన్నారు. కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని వాళ్ల ప్రాథమిక హక్కుల్ని కాలరాయలేమని పేర్కొన్నారు. దంపతులకు సరైన భద్రత కల్పించాలని పఠాన్‌కోట్ SSPని జస్టిస్ జస్‌జిత్ సింగ్ బేడీ ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story