Uniform Civil Code: మోదీ సివిల్ కోడ్ వ్యాఖ్యలపై ముస్లిం లా బోర్డు గరం గరం

దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం కేంద్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక దేశం రెండు చట్టాలపై ముందుకు సాగలేదంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు దేశావ్యాప్తంగా కలకలం సృష్టించాయి. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా అటు ముస్లిం పర్సనల్ అర్ధరాత్రి అత్యవసర సమావేశం నిర్వహించుకుంది.
ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ముస్లిం పర్సనల్ లా బోర్డు అత్యవసరంగా భేటీ అయింది. ఒకే దేశంలో రెండు చట్టాలు పని చేయవని, రాజ్యాంగం కూడా పౌరులందరికీ సమాన హక్కులను ప్రస్తావిస్తున్నదని, సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఏకరీతి చట్టాలను కోరుతున్నాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ముస్లిం లాబోర్డు సుమారు 3 గంటల పాటు చర్చించింది.
న్యాయవాదులు, నిపుణులు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని లా కమిషన్‌కు తమ అభిప్రాయాలను సమర్పించాలని ముస్లిం లాబోర్డు నిర్ణయించింది. ముస్లిం లా బోర్డు ప్రెసిడెంట్ సైఫుల్లా రెహమానీ అధ్యక్షతన.. ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా చైర్మన్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహాలీ, ముస్లిం లా బోర్డు ఇతర సభ్యులు ఈ భేటీకి వర్చ్యువల్ గా హాజరయ్యారు. ప్రభుత్వం త్వరలో ముసాయిదా బిల్లును తీసుకురావాలని యోచిస్తున్న నేపథ్యంలో ఇందులో భాగస్వాముల అభిప్రాయాలను కోరుతూ లా కమిషన్ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తోంది. కాబట్టీ లా కమిషన్ కు తమ అభిప్రాయాలు కూడా చెప్పాలని ముస్లిం పర్సనల్ లాబోర్డు నిర్ణయం తీసుకుంది.
ఉమ్మడి పౌరస్మృతి అనేది దేశంలోని ప్రతి ఒక్కరికీ వర్తించే మతం-ఆధారిత వ్యక్తిగత చట్టాలు, వారసత్వం, దత్తత, వారసత్వ నియమాలను నిర్దేశిస్తుంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 భారతదేశ భూభాగం అంతటా ఒకే విధమైన పౌర కోడ్‌ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కేంద్రం సిద్ధమవుతోంది. మరోవైపు మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు డీఎంకే, ఎం ఐ ఎం పార్టీ ల నేతలు ఇది మోదీ ప్రభుత్వం ఇతర సమస్యలను పక్కదోవ పట్టించడానికి ఆడుతున్న నాటకమాన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com