Secunderabad : ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం..

సికింద్రాబాద్‌ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీస్ సమీపంలోని కూర్మగూడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోండా మార్కెట్‌లోని ముత్యాలమ్మ గుడలోకి అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గమనించిన స్థానికులు దుండగుల్లో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సికింద్రాబాద్‌‌లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని నిన్న(ఆదివారం) రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే గణేష్‌ ఆలయం వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు హిందూ సంఘాలు ఆలయం వద్దకు చేరుకుని ఆందోళనలు చేపట్టారు. ఘర్షణలు తలెత్తకుండా ఆలయం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి చర్యలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విగ్రహ ధ్వంసంపై కేంద్రమంత్రి ఆగ్రహం

మతోన్మాదంతోనే ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించిన ఆయన.. నిందితులను కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. డీజేలపై నిషేధం విధించిన పోలీసులు, దేవాలయాల పరిరక్షణపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నవరాత్రుల వేళ చాలా ఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర !

హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాంపల్లి ఘటన మర్చిపోకముందే ఇఫ్పుడు సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహ ధ్వంసంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. దుర్గమ్మ నవరాత్రుల పూజ సందర్భంగా కూడా అనేక రకాల ఘటనలు జరగడం వెనక ఏమైనా కుట్ర ఉందా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటలనపై హిందూసంఘాలతో పాటు హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ దుర్గామాత ఆలయంలో దొంగతనానికి రాలేదని, దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికే వచ్చి ఉంటారని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో వచ్చి సికింద్రాబాద్ ముత్యాలమ్మ వారి విగ్రహాన్ని తొలగించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. దేవాలయాల వద్ద రాత్రి సమయంలో పోలీస్ పర్యవేక్షణ ఉండాలని కిషన్ రెడ్డి కోరారు.

Tags

Next Story