Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా

Maharashtra PCC: మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా
X
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ రాజీనామా..

ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌ నానా పటోల్‌ తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని హైకమాండ్‌కు పంపారు.

కాగా శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 288 స్థానాలకు గానూ ఏకంగా.. 233 స్థానాల్లో జయభేరి మోగించింది. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి కేవలం 51 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఇక కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 2021లో నానా పటోల్‌ మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.

ఇక, 2014లో కాంగ్రెస్ పార్టీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోడీ హవాతో మహారాష్ట్రలో కాంగ్రెస్‌ తీవ్రంగా నష్ట పోయింది. అప్పట్లో కేవలం 42 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. నాటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ కోలుకోలేదు. తాజా ఎన్నికల్లో కనీసం 25 స్థానాలు కూడా సాధించలేకపోయింది. కొన్ని వర్గాలపై అధికంగా ఆధారపడటం, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లకపోవడం.. తదితర అంశాలతో పార్టీ ప్రజాదరణను కోల్పోతోందని రాజకీయ నిపుణులు తమ అభిప్రాయం వెల్లడించారు. అయితే, 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నానా పటోలే బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసిన 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో విజయం సాధించి.. అద్భుతమైన ప్రదర్శన చూపించింది.

Tags

Next Story