Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు.. వెల్లువెత్తిన శుభాకాంక్షలు

భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం తన 74వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినవారిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరితోపాటు వివిధ దేశాల అధినేతలు మోదీకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మోదీ పుట్టినరోజు వేడుకలను “సేవా పర్వ్”గా బీజేపీ నిర్వహిస్తుంది. 1950 సెప్టెంబరు 17న గుజరాత్‌లోని మెహసానా పట్టణంలో జన్మించిన నరేంద్ర దామోదరదాస్ మోడీ అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి, దేశ ప్రధానిగా అత్యున్నత స్థానాలను అదిరోహించారు. వరసగా మూడుసార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చి మోదీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్నారు.
ప్రధాని మోదీ ఇవాళ భువనేశ్వర్ గడ్కనాలో 26లక్షల ఇళ్లను ప్రారంభించనున్నారు. భువనేశ్వర్ లో పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులతో మోదీ మాట్లాడనున్నారు. అనంతరం జనతా మైదాన్ లో సుభద్రత యోజన పథకాన్ని ప్రారంభిస్తారు. సుభద్ర యోజన కింద ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా పేద మహిళలకు ఐదు సంవత్సరాల పాటు రెండు సమాన వాయిదాలలో రూ. 10,వేల ఆర్ధిక సహకారం అందనుంది. జగన్నాథుని సోదరి అయిన సుభద్రదేవి పేరు మీద ఆర్థిక సహాయ పథకం ను అమలు చేయనున్నారు. ఒడిశా ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ కీలక వాగ్దానం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com