Vijayendra Prasad: రాజ్యసభకు ఎంపికైన 'బాహుబలి' రైటర్.. మోదీ స్పెషల్ ట్వీట్..

Vijayendra Prasad: 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత సంచలనం సృష్టించిందో ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఈ సినిమాలను ముందుండి నడిపించింది హీరోలే అయినా.. వెనకుండి సారథిగా వ్యవహరించింది దర్శక ధీరుడు రాజమౌళి అయినా.. ముందుగా ఈ కథలకు ప్రాణం పోసింది మాత్రం విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్.. తమ జీవితంలోని ఓ కొత్త అధ్యాయనానికి శ్రీకారం చుట్టనున్నారు.
తెలుగులో గుర్తింపు ఉన్న సీనియర్ రైటర్స్‌లో విజయేంద్ర ప్రసాద్‌కు ప్రథమ స్థానం ఉంటుంది. టాలీవుడ్ రూపురేఖలను మార్చేసిన బాహుబలిలాంటి చిత్రం తెరకెక్కించినందుకు రాజమౌళికి, అందులో నటించినందుకు ప్రభాస్‌కు ఎంత గుర్తింపు వచ్చిందో విజయేంద్ర ప్రసాద్ కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఇతర భాషా హీరోలు సైతం తమకోసం ఒక కథ రాసివ్వమని ఆయనను అడుగుతుంటారు.
దర్శక ధీరుడుగా పేరు తెచ్చుకున్న రాజమౌళికి రథచక్రంగా ఉన్న విజయేంద్ర ప్రసాద్.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు సినీ పరిశ్రమకే అంకితమైన ఆయన.. త్వరలోనే రాజకీయాల్లో కూడా అడుగుపెట్టనున్నారు. ఇటీవల విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల అయ్యింది. దీంతో అటు ప్రేక్షకుల్లో, ఇటు సినీ పరిశ్రమలో అంటూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా ఎంపికవుతున్న సందర్భంగా విజయేంద్ర ప్రసాద్‌కు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 'విజయేంద్ర ప్రసాద్ గారు క్రియేటివ్ ప్రపంచంలో ఎన్నో దశాబ్దాల నుండి ఉన్నారు. ఆయన వర్క్ ఇప్పటివరకు భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆయనకు ధన్యవాదాలు'. అన్నారు మోదీ
Shri V. Vijayendra Prasad Garu is associated with the creative world for decades. His works showcase India's glorious culture and have made a mark globally. Congratulations to him for being nominated to the Rajya Sabha.
— Narendra Modi (@narendramodi) July 6, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com