Narendra Modi: జర్మనీలో మోదీకి ఆత్మీయ స్వాగతం.. చిన్నారుల కానుకలను స్వీకరించిన ప్రధాని..

Narendra Modi: ప్రధాని మోదీ మూడు రోజుల యూరప్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. తొలుత జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీకి ఆదేశ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బెర్లిన్‌లో జర్మన్ ఛాన్సలర్ ఓలాస్ స్కాల్జ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య వ్యాపార రంగాలకు ఊతమిచ్చేలా రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
జర్మనీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఐజీసీతో భారత్ జత కలవడాన్ని స్వాగతించారు. ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఐజీసీ ఉపకరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు జర్మనీలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయులు ఆత్మీయ స్వాగతం పలికారు. కొందరు చిన్నారులు ఆకట్టుకునే బహుమతులు ఇచ్చారు.
ఓ చిన్నారి తాను గీసిన చిత్రాన్ని ప్రధానికి బహూకరించింది. అక్కడే ఉన్న మరో బాలుడు దేశభక్తి గీతం ఆలపించాడు. బాలుడి పాట వింటున్నంత సేపు మోదీ చిటికెలు వేస్తూ అతడిని ఉత్సాహపరిచారు. అనంతరం అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. ఇక జర్మనీ నుంచి డెన్మార్ వెళ్లనున్న ప్రధాని మోదీ.. అనంతరం తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ దేశాధినేతలను కలువనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com