Narendra Modi : తగ్గని ప్రధాని మోడీ పాపులారిటీ

తగ్గని ప్రధాని మోడీ పాపులారిటీ , మహారాష్ర్ట, హర్యానా విజయానికి అదే కారణం కారణమని ఓ ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వేలో వెల్లడయ్యింది.
ఇటీవల జరిగిన పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు బిజెపికి మంచి బూస్ట్ ను ఇచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రజల్లో ప్రధాని మోడీ పాపులారిటీ పెరగడమేనని స్పష్టం అవుతోంది. ఈ విషయం ప్రముఖ మీడియా సంస్థ ఐఎఎన్ ఎస్ నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు పెద్ద ఊరట నివ్వనప్పటికీ మహారాష్ర్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపికి అనూహ్య విజయాన్ని సాధించాయి. రెండు రాష్ర్టాల్లో బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
ఈ విజయాలకు కారణం ప్రధాని మోడీ పాపులారిటీ పెరడగంతో పాటు మరికొన్ని ఆసక్తికర అంశాలు ఐఎఎన్ ఎస్ సర్వేలో వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ ప్రత్యేకించి రాహుల్ గాంధీ చేసిన రాజ్యాంగాన్ని మారుస్తారనే ప్రచారం ఏమాత్రం ప్రభావం చూపలేదని , బిజెపి వ్యూహాల ముందు నిలువలేకపోయిందని కూడా స్పష్టమైనట్లు ఆ మీడియా సంస్థ వెల్లడించింది.
నవంబర్ 25 నుండి డిసెంబర్ 14 వరకు మహారాష్ర్ట లోని 76,830 శాంపిల్స్, హర్యానాలో 53,647 శాంపిల్స్ ద్వారా వెల్లడైన విషయాలను ఐఎఎన్ ఎస్ తన సర్వే నివేదికలో వెల్లడించింది. హర్యానా, మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలపై ప్రముఖ మీడియా సంస్థ ఐఎఎన్ ఎస్ సర్వేలో ని కీలక అంశాలను ఒకసారి పరిశీలిస్తే...
మోడీకి ప్రజల్లో విస్ర్తుత ఆదరణ : ఆరు నెలలు క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 240 సీట్లే గెలిచినప్పటికీ మహారాష్ర్ట, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రభావం కొనసాగినట్లు సర్వే వెల్లడించింది. మోడీ బలమైన, అత్యంత ప్రభావితమైన నాయకుడనే విషయం స్పష్టమైంది. రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయానికి మోడీకి వున్న పాపులారిటీ ప్రధాని కారణమని ఐఎఎన్ ఎస్ పేర్కొంది. తాము చేసిన సర్వేలో మహారాష్ర్టలో 55 శాతం, హర్యానాలో 53 శాతం మోడీ ఛర్మిషా వున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.
పనిచేయని కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రచారం : సర్వేలో వెల్లడైన మరో కీలక అంశం కాంగ్రెస్ ప్రత్యేకించి రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ప్రజాదరణ పొందలేదని...మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరిస్తుందని రాహుల్ చేసిన ప్రచారం లోక్సభ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపినా మహారాష్ర్ట, హర్యానా ఎన్నికల్లో పనిచేయలేదని ఐఎఎన్ ఎస్ వెల్లడించింది. రాజ్యాంగాన్ని సవిరిస్తారని, వ్యవసాయ చట్టాలు, వ్రెస్ట్ లర్స్ పై కాంగ్రెస్ ప్రచారం పనిచేయలేదని, ఈ విషయాలను ప్రజలు పట్టించుకోలేదని తమ సర్వేలో వెల్లడైనట్లు మీడియా సంస్థ వెల్లడించింది.
రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై ఓటర్లలో పెద్దగా విశ్వాసం లేదన్న విషయం కూడా రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని ఐఎఎన్ ఎస్ వెల్లడించింది. ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీని ప్రజలు భావించడం లేదని, ఆయన నేత్రుత్వంలో కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకు అనుమానాలు వున్నాయని విషయం కూడా వెల్లడైనట్లు ఐఎఎన్ ఎస్ పేర్కొంది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు మారిన ఓటర్ సెంటిమెంట్ : లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయకుండా తప్పు చేశామని ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు భావించారు. నిర్ణయాన్ని సరిచేసుకుని బిజెపి వైపు మొగ్గుచూపారు. ఇందుకు ప్రధాన కారణం ప్రధాని మోడీ నాయకత్వంపై వున్న విశ్వాసం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. బిజెపికి తాము ప్రత్యామ్నాయం అనే విషయాన్ని ప్రతిపక్షాలు నిరూపించలేకపోయాయి.
బిజెపి వ్యూహాలు, నాయకత్వం : కలిసివుంటేనే సురక్షితంగా వుంటామనే సందేశం కూడా ప్రజల్లోకి బలంగా వెల్ళింది. మోడీ నాయకత్వంలో సుస్థితర, జాతీయభద్రత, ఆర్థికాభివ్రుద్ధి సాద్యమని ప్రజలు భావించారు. ఈ సందేశాన్ని బిజెపి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగింది, ప్రజలు కూడా విశ్వసించారు. అదే కాంగ్రెస్ కు వచ్చే సరికి ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ప్రజలు గమనించారు. ఆ కారణంగానే బిజెపి కి సమాతరంగా కాంగ్రెస్ నేతలు సవాల్ విసరలేకపోయారు.
స్థానిక నాయకత్వం, వ్యవస్థాగత అంశాలు : హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను మార్చి మరొకకరికి అవకాశం ఇవ్వడం బిజెపికి బాగా కలిసొచ్చింది. సర్వేలో పాల్గొన్న 44 శాతం మంది నాయకత్వ మార్పు కీలక ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. స్థానిక బిజెపి నాయక్వతం, అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ప్రచారం కూడా విజయానికి కారణం అయింది.
ప్రభుత్వ ప్రథకాలు, స్థానిక ప్రజల మద్దతు : రెండు రాష్ర్టాల్లోనూ ప్రజల మద్దతు చూరగొనటానికి మరో ప్రధాన కారణం స్థానిక అంశాలపై బిజెపి నాయకత్వం ఫోకస్ చేయడం, అమలు చేస్తున్న పథకాలు. బిజెపి ప్రభుత్వాలు ప్రత్యేకించి వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివ్రుద్ధి కి తీసుకున్న చొరవ, చర్యలు కూడా ఎన్నికల్లో సానుకూల ఫలితాలు ఇచ్చాయి. పథకాలు, చర్యలు కారణంగా తాము లబ్ది పొందినట్లు ప్రజలు భావించారని, ఓటర్లు ప్రభావితం అయ్యారని ఐఎన్ ఎన్ ఎస్ మీడియా సంస్థ సర్వే వెల్లడించింది.
-తేలప్రోలు శ్రినివాసరావు, న్యూఢిల్లీ బ్యూరో ఛీఫ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com