Odisha : ఒడిశాలో బీజేడీ – బీజేపీ మధ్య తీవ్ర పోటీ
బిహార్‌లో ఈ నెల 13న జరగనున్న నాలుగో విడత ఎన్నికలు పలువురు సీనియర్ నేతలకు కీలకంగా మారాయి. ఏడగురు సీనియర్ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత మూడు విడతల పోలింగ్‌లో అత్యల్ప ఓటింగ్ నమోదు కావడంతో వీరు మరింత కష్టపడుతున్నారు. ప్రజలను పోలింగ్ బూత్‌లకు తీసుకొచ్చి ఓటేయించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు..బిహార్ రాష్ట్ర మంత్రులు ఉన్నారు. నాలుగో విడతలో ఒక రాష్ట్ర మంత్రి తన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సి రావడం కొసమెరుపు.
ఈ నెల 13న జరగనున్న నాలుగో విడతలో బిహార్‌లో 5 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడుగురు సీనియర్ నేతలు ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వారిలో కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, బిహార్ రాష్ర్ట మంత్రులు అశోక్ చౌధరి, మహేశ్వరీ హజారీ లాంటి నేతలుఉన్నారు. ఇందులో ఒక రాష్ట్ర మంత్రి తన కుమారుడికి వ్యతిరేకంగా... ప్రచారం చేయాల్సి రావడం గమనార్హం. దర్భంగాలో 8, ఉజియార్‌పుర్‌లో ౧౩, సమస్తీపుర్ 12, బెగుసరాయ్ 10, ముంగేర్‌లో 12 మంది మెుత్తం 5 నియోజకవర్గాల్లో 55 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత మూడు విడతల పోలింగ్‌లో.. అత్యల్ప ఓటింగ్ నమోదు కావడంతో ప్రజలను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు సీనియర్ నేతలు మరింత కష్టపడుతున్నారు.
బీజేపీ – బీజేడీ మధ్య ముందు నుంచి మంచి స్నేహం కొనసాగింది. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి అధికారం పంచుకున్నాయి. 2009 ఎన్నికల ముందు ఆ పార్టీలు వేరు పడ్డాయి. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగింది. ఎన్డీఏలో బీజేడీ భాగస్వామిగా లేనప్పటికీ కేంద్రంతో స్నేహపూర్వక వైఖరిని అవలంబించింది. ఈ ఎన్నికల ముందు కూడా రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరిగినా సీట్ల పంపిణీ కుదరకపోవడంతో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగుతున్నాయి. రాష్ట్రంలో గతంలో బీజేడీ – కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. 2019లో కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టేసి బీజేపీ ప్రధాన రేసులోకి వచ్చింది. 2019లో బీజేడీ 12 లోక్‌సభ, 112 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగా, బీజేపీ ఎనిమిది లోక్‌సభ, 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక లోక్‌సభ సీటును, 9 అసెంబ్లీ స్థానాలను సాధించింది.
ఒడిశాలో ప్రధానంగా ప్రధాని మోదీ, సీఎం నవీన్ పట్నాయక్ మధ్యే పోటీ ఉంది. రాష్ట్ర బీజేపీలో చెప్పుకోదగ్గ నేతలు, కేంద్రమంత్రులుగా పని చేస్తున్న వారు సైతం ఉన్నప్పటికీ వీరెవరూ ఒడిశా ప్రజల్లో సీఎం నవీన్ పట్నాయక్‌కు ఉన్న ఇమేజ్‌తో పోటీ పడే స్థాయిలో లేరు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రధానంగా మోదీ ఇమేజ్‌పైనే ఆధారపడింది. మరోవైపు బీజేడీ పూర్తిగా పట్నాయక్ కరిష్మాపైనే నడిచే పార్టీ. అయితే, ఇద్దరి మధ్య పోటీతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. గత ఎన్నికల్లో ఇదే జరిగింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com