NCC లీడర్ అతి.. క్యాడెట్లను బురదలో తల పెట్టించి..!

NCC లీడర్ అతి.. క్యాడెట్లను బురదలో తల పెట్టించి..!
X
విద్యార్థులు బురదలో తలలు పెట్టుకున్నారు. ఒక సీనియర్ విద్యార్థి చేతిలో చెక్క కర్రతో నిలబడి ఉన్నాడు

మహారాష్ట్రలో చోటుచేసుకున్న దారుణం వెలుగులోకి వచ్చింది. థానేలో ఓ కాలేజీ లో పనిష్‭మెంట్ పేరుతో ఎన్‭సీసీ క్యాడెట్లను ఒక సీనియర్ అత్యంత ఉన్మాదంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కుండపోత వర్షంలో జూనియర్ క్యాడెట్లతో వార్మప్‌ చేయించారు, అయితే అది సరిగా చేయలేని వారిని కర్రలతో అత్యంత అమానుషంగా కొట్టారు. ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేస్తూ యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూసి షాక్ తిన్నామని, నిందితులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.

దాదాపు 8 మంది విద్యార్థులను వరుసగా పుష్-అప్ పొజిషన్‌లో పడుకోబెట్టారు. విద్యార్థులు బురదలో తలలు పెట్టుకున్నారు. ఒక సీనియర్ విద్యార్థి చేతిలో చెక్క కర్రతో నిలబడి ఉన్నాడు. ఏ విద్యార్థి అయినా కొంచెం కదిలితే చెక్క కర్రలతో కనికరం లేకుండా కొట్టడం వీడియోలో క్లియర్‌గా కనిపిస్తోంది..ఈ సీనియర్ విద్యార్థుల బీభత్సం జూనియర్ విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఫిర్యాదు నమోదు కాలేదు. అయితే ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ రకమైన ప్రవర్తనను తాము సహించలేమని, బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపాల్‌ సుచిత్రానాయక్‌ అన్నారు.

Tags

Next Story