ప్రతిపక్ష నాయకుడి బాధ్యత వద్దు: అజిత్ పవార్

మహారాష్ట్ర అసెంబ్లీలో తనకున్న ప్రతిపక్ష నాయకుడి బాధ్యత వద్దంటూ ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ తెగేసి చెప్పడం ప్రస్తుతం పార్టీలో కలవరం కలిగిస్తోంది. ముంబైలో జరిగిన 24వ వసంతోత్సవ వేడుకల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసిన ఆయన.... మరే బాధ్యత ఇచ్చినా న్యాయం చేస్తానని అన్నారు. ఎన్సీపీలో ప్రధాన బాధ్యతలను సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌కు అప్పజెపుతూ శరద్ పవార్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి ఎదురు చెప్పలేక అప్పట్లో మిన్నకుండిపోయిన అజిత్ పవార్.. తాజాగా కొత్త డిమాండ్‌ను తెరపైకి తేవడంతో పార్టీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. మహ వికాస్ అఘాడీ ప్రభుత్వంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే, శివసేన పార్టీలో చీలికలతో ప్రభుత్వం కూలిపోయిన నాటి నుంచీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com