Manipur: మణిపుర్‌ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరణ

Manipur: మణిపుర్‌ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరణ
కుకీ పీపుల్స్‌ అలయన్స్ పార్టీ కీలక నిర్ణయం... అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు భయపడుతున్న ఎమ్మెల్యేలు

జాతుల మధ్య వైరంతో గత మూడు నెలలుగా మణిపుర్‌ అల్లకల్లోలమవుతోంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా హింసాత్మక ఘటనలు(violence in Manipur)కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య కీలక రాజకీయ పరిణామం సంభవించింది.NDA భాగస్వామి భాగస్వామి కుకీ పీపుల్స్ అలయన్స్( Kuki People’s Alliance).. బిరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ‍ (withdraws support to Biren Singh‌) కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్టీ.. భాజపా ప్రభుత్వానికి(BJP-led government ) మద్దతు ఉపసంహరించుకున్నామని గవర్నర్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిరేన్ సింగ్‌( Biren Singh) ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సహేతుకం కాదని ఆ పార్టీ వెల్లడించింది. ఇక నుంచి KPA మద్దతు మణిపుర్ ప్రభుత్వానికి ఉండదని లేఖలో పేర్కొంది.


మరోవైపు ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్న మణిపుర్ అసెంబ్లీ సమావేశాలకు ఇంఫాల్‌ వెళ్లేందుకు కుకీ ఎమ్మెల్యేలు( Kuki MLAs) భయపడిపోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలే వెల్లడించాయి. పార్టీలకు అతీతంగా కుకీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాబోరని ఆయా పార్టీలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా రాబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం సాధ్యం కాదని చురచంద్‌పుర్‌ బీజేపీ ఎమ్మెల్యే ఖౌటే అన్నారు. హింస, ప్రత్యేక పరిపాలన కోసం కుకీలు చేసిన డిమాండ్లకు పరిష్కారం లేకపోవడం వల్ల తమ వర్గం ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని తెలిపారు.


ప్రస్తుత పరిస్థితుల్లో ఇంఫాల్‌కు ఎమ్మెల్యేలు సురక్షితంగా ప్రయాణించలేరని బీజేపీ ఎమ్మెల్యే వుంగ్‌జాగిన్ తెలిపారు. 60 స్థానాలున్న మణిపుర్‌లో అసెంబ్లీలో బీజేపీకి చెందిన ఏడుగురు, కుకీ పీపుల్స్ అలయన్స్‌కు చెందిన ఇద్దరు, ఒక స్వతంత్రుడితో సహా మొత్తం 10 మంది కుకీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. అత్యవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆరోడు వీలు కల్పించనున్నారు.

మణిపుర్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంగోల్ గ్రామంలో 15 ఇళ్లకు నిప్పంటించాయి అల్లరిమూకలు. 45 ఏళ్ల వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో బాధితుడు ఎడమతొడకు బుల్లెట్ గాయమైంది. అతడికి ప్రాణాపాయం లేదని సమాచారం. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అనంతరం పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story