Suicide: కోటాలో మరో విద్యార్థి మృతి..

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెంట్ అపార్ట్‌మెంట్‌లోనే అతను ఉరి వేసుకున్నాడు. కానీ అతని రూమ్‌లో సూసైడ్ నోట్ దొరకలేదు. బెంగాల్‌లోని బిర్హమ్ జిల్లాకు చెందిన ఫౌరీద్ హుస్సేన్.. ఏడాది నుంచి మెడికల్ పరీక్ష నీట్ కోసం ప్రిపేరవుతున్నాడు. ఈ ఏడాది జూలై నుంచి వౌఫ్ నగర్ లో కిరాయికి ఉంటున్నాడు. అదే ఇంట్లో మరో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు ఉంటున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి అతను ఇంట్లోనే ఉన్నాడు. అయితే రాత్రి 8 గంటల వరకు అతను బయటకు రాలేదు. ఫ్రెండ్స్ పిలిచినా అతను డోరు ఓపెన్ చేయలేదు. దీంతో ఇంటి యజమానికి తెలిపారు.
రూమ్‌లోకి వెళ్లిన పోలీసులు.. హుస్సేన్ ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. పేరెంట్స్ వచ్చాకే అతనికి పోస్టుమార్టమ్ చేయనున్నారు. కోటాలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల్లో ఆత్మహత్య చేసుకోవడం ఇది ఈ ఏడాది 25వ ఘటన. సెప్టెంబర్ 18వ తేదీన యూపీకి చెందిన నీట్ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్నది.
దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. ఆత్మహత్యలను నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ అభ్యర్థి వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తానుంటున్న గదిలో సూసైడ్ చేసుకున్నాడు. అతడిని పశ్చిమబెంగాల్‌కు చెందిన 20 ఏండ్ల ఫరీద్ హుస్సేన్‌గా గుర్తించారు. అతడు మరికొంత మంది విద్యార్థులతో కలిసి కిరాయికి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. దీంతో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 28కి చేరింది.
ఈ మధ్యకాలంలో విద్యార్థులు బలవన్మరణాల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోచింగ్ సెంటర్లతోపాటు హాస్టళ్లు, కిరాయికి ఇచ్చే నివాసాల్లో ఫ్యాన్లకు యాంటీ హాంగింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రెండు నెలలపాటు ఎఆలంటి పరీక్షలు నిర్వహించకూడదని కోచింగ్ సెంటర్లక నిర్వాహకులకు నిర్ధేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com