రేపు నీట్ పరీక్ష.. పరీక్షలో ఫాలో కావలసిన రూల్స్ ఇవే..

రేపు నీట్ పరీక్ష.. పరీక్షలో ఫాలో కావలసిన రూల్స్ ఇవే..
దేశంలోని MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష-నీట్ రేపు జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం..

దేశంలోని MBBS, BDS కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష-నీట్ రేపు జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెన్, పేపర్ బేస్డ్ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష కోసం విస్త్రత ఏర్పాట్లు చేశారు. నీట్‌కు 15 లక్షల 97 వేల 433 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో NTA పరీక్షా కేంద్రాల సంఖ్య పెంచారు. ఒక్కో రూమ్‌లో 12 మంది విద్యార్థులు మాత్రమే కూర్చునెలా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా 3 వేల 842 కేంద్రాల్లో నీట్ పరీక్ష జరగనుంది.

తెలంగాణ రాష్ట్రం నుంచి 55 వేల 800 మంది రిజిస్టర్ చేసుకోగా... వారికి 112 పరీక్షా కేంద్రాలను కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అడ్మిట్ కార్డులో పాటించవలసిన నియమాలతో పాటు అభ్యర్థులు తమ ఆరోగ్య స్థితిని తెలియచేసే సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉండనుంది. అడ్మిట్ కార్డుతోపాటు ఆధార్, పాన్ కార్డ్ వంటి ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి ఉండాల్సిందే. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి తమ అడ్మిట్ కార్డులో ఇచ్చిన టైంలోనే వెళ్ళాలి. ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

ప్రవేశ ద్వారం వద్దే టెంపరేచర్ చెక్ చేస్తారు. కరోనా లక్షణాలు ఉంటే ప్రత్యేక గదిలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు మాస్కులు, గ్లౌజులు తీసుకెళ్ళాలి. అలాగే 50 ML శానిటైజర్, ట్రాన్స్ పరెంట్ వాటర్ బాటిల్‌కు అనుమతి ఇవ్వనున్నారు. ఫోన్, వాచ్‌సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. ఇక బంగారు అభరణాలు వేసుకుని పరీక్షకు రావడం నిషిద్ధం. పొట్టి చేతుల చొక్కాలు వేసుకెళ్ళాలి. వాటికి పెద్ద పెద్ద గుండీలు ఉండరాదు. షూస్ వేసుకు రానీయరు. కేవలం స్లిప్పర్స్‌కే అనుమతి ఉన్నట్లు అధికారులు చెప్పారు.

Tags

Next Story