Neet Pg 2024 New Date: ఆగస్టులో నీట్ పీజీ పరీక్ష

Neet Pg 2024 New Date: ఆగస్టులో నీట్ పీజీ పరీక్ష
X
రెండు షిఫ్టుల్లో పరీక్ష ఎన్‌బీఈఎంఎస్‌

జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్​ పీజీ పరీక్షను ఆగస్టు 11కు రీషెడ్యూల్ చేశారు. అదే రోజు రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్షను నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS) శుక్రవారం స్పష్టం చేసింది. ఈ పరీక్షకు అర్హత సాధించేందుకు కటాఫ్ తేదీని 2024 ఆగస్టు 15గా నిర్ణయించింది. నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్‌ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొంది. దీంతో జూన్ 23న జరగాల్సిన నీట్‌ పీజీ 2024 పరీక్ష నిర్వహణను జూన్ 22న కేంద్రం వాయిదా వేసింది. తాజాగా ఆగస్టు 11కు నీట్ పీజీ ఎగ్జామ్​ను రీషెడ్యూల్ చేసింది. కాగా, నీట్ పీజీ ప్రవేశ పరీక్షను 'నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మెడికల్ సైన్సెస్' టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో కలిసి ప్రతి ఏటా నిర్వహిస్తుంది.

Tags

Next Story