Neet Ug 2025 : ఆఫ్‌లైన్‌లోనే నీట్-యూజీ

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్‌గ్రాడ్యుయేట్ (నీట్ యూజీ)-2025ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఈ పరీక్ష ఒకే రోజు, ఒకే షిఫ్ట్‌లో జరుగుతుందని తెలిపింది. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. కేంద్ర విద్య, ఆరోగ్య శాఖల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపింది. బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్ కోర్సుల కోసం కూడా నీట్ (యూజీ)ని రాయాలని పేర్కొన్నది.
నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి పరిధిలోని బీహెచ్‌ఎంఎస్ కోర్సు కోసం కూడా ఈ పరీక్షను రాయాలని చెప్పింది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్స్ నిర్వహించే బీఎస్‌సీ నర్సింగ్ కోర్సుల్లో చేరడం కోసం కూడా నీట్ (యూజీ), 2025ని రాయాలని వివరించింది. కంప్యూటర్ బేస్డ్ విధానం కన్నా పెన్, పేపర్ మోడ్ వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని చాలా మంది విద్యార్థులు స్వాగతించే అవకాశం ఉంది. అభ్యర్థుల హాజరునుబట్టి చూసినపుడు మన దేశంలో అతి పెద్ద ప్రవేశ పరీక్ష నీట్. గత ఏడాది ఈ పరీక్షకు 24 లక్షల మందికిపైగా హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com