Israeli PM Benjamin: ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో మోడీకి సలహాలు ఇస్తా: నెతన్యాహు

అగ్రరాజ్యం అమెరికా, భారత్ మధ్య టారీఫ్స్ విషయంలో ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కొన్ని సలహాలు ఇస్తానని పేర్కొన్నారు. మోడీ, ట్రంప్.. ఇద్దరూ నాకు మంచి స్నేహితులే.. ట్రంప్‌తో ఎలా వ్యవహరించాలి అననే విషయంలో మోడీకి కొన్ని సలహాలను ఇస్తాన్నారు. అయితే, ఆ విషయాన్ని మోడీకి వ్యక్తిగతంగా మాత్రమే చెబుతాను అని బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు.
అయితే, గురువారం నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత జర్నలిస్టులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా- భారత్ మధ్య సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. సుంకాల సమస్యను త్వరలోనే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, మరోవైపు.. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రతిపాదనకు ఇజ్రాయెల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 22 నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతుండగా.. ఈ నిర్ణయం కీలక మలుపుగా అని చెప్పాలి. అయితే, టెల్‌అవీవ్ నిర్ణయంపై విదేశీ నేతలతో పాటు స్వదేశీయులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com