Harnaaz Sandhu: లావుగా అయ్యావంటూ మిస్ యూనివర్స్‌పై కామెంట్స్.. హర్నాజ్ స్ట్రాంగ్ రిప్లై..

Harnaaz Sandhu (tv5news.in)
Harnaaz Sandhu: ఒకవేళ లావుగా ఉంటే.. మరీ లావుగా ఉన్నావంటారు. సన్నగా ఉంటే మరీ సన్నగా ఉన్నావ్, ఆరోగ్యంగా లేవు అంటారు. అంటే.. ఎలా ఉన్నా.. ఇలా విమర్శించేవారు ఉంటారు. మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుకు కూడా ఇలాంటి విమర్శలు తప్పట్లేదు. లావు అయ్యిందంటూ హర్నాజ్‌పై వస్తు్న్న విమర్శలకు తాను ఘాటుగానే స్పందించింది.
మిస్ యూనివర్స్ కిరీటాన్ని 20 ఏళ్ల తర్వాత ఇండియాకు తీసుకువచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది హర్నాజ్ కౌర్ సంధు. అయితే మిస్ యూనివర్స్ పోటీల సమయంలో హర్నాజ్ చాలా సన్నగా ఉండేది. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంది హర్నాజ్. ఆ సమయంలో తను చాలా లావుగా కనిపిస్తుంది అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి.
లావుగా ఉన్నావంటూ వస్తున్న కామెంట్స్‌కు తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చింది హర్నాజ్ సంధు. ఒకప్పుడేమో తాను చాలా సన్నగా ఉంది అనేవారని, ఇప్పుడేమో లావుగా ఉంది అంటున్నారని తెలిపింది మిస్ యూనివర్స్. తనకు సీలియక్ డిజీజ్ అనే ఒక వ్యాధి ఉన్నట్టు దాని వల్లే ఇలా లావు అయినట్టు బయటపెట్టింది. అంతే కాకుండా ఎన్ని విమర్శలు వచ్చినా తన శరీరాన్ని తాను ప్రేమించుకుంటానని తేల్చి చెప్పింది హర్నాజ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com