నీతా అంబానీ భక్తికి ముగ్ధులైన నెటిజెన్లు

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్‌లో విందుకు ప్రధానీ మోదితో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలకు ఆహ్వానం లభించింది. అందులో భారత్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖేష్ అంబానీతో పాటు అతని సతీణి నీతా అంబానీ కూడా హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రాధాని నరేంద్ర మోదీలతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి, ఆనంద్ మహేంద్రలు ఉన్న వీడియో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దానీతో పాటు మరో వీడియో కూడా నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. ఏప్రిల్‌లో జరిగిన NMACC ఈవెంట్‌లో భారత సంస్కృతి కళల ప్రదర్శన జరిగింది. ఇందులో దేశంలోని వివిద ప్రాంతాల నుంచి చిత్ర కళ, శిల్పకళ, వస్త్రాల ప్రదర్శన జరిగింది. నీతా అంబానీ ఆ వేడుకకు హాజరయ్యారు. అక్కడ ఓ చిత్రకారుడు తాను చిత్రీకరించిన శ్రీనాథ్ దేవుడి పటాన్ని నీతాకు అందించారు. ఈ క్రమంలో నీతా అంబానీ తాను ఆ చిత్రాన్ని తీసుకునే సమయంలో చెప్పులను విడిచి దేవుడి చిత్రానికి నమస్కరించి తీసుకున్నారు. దాని గురించి నీతా అంబానీ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఖచ్చితంగా నా పూజ గదిలో ఉంచుతాను అంటూ వెల్లడించింది. ఆ వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com