New Parliament Building : నూతన పార్లమెంటు భవనంపై.. 9వేల 500ల కేజీల జాతీయ చిహ్నం

New Parliament Building : నూతన పార్లమెంటు భవనంపై.. 9వేల 500ల కేజీల జాతీయ చిహ్నం
New Parliament Building : నూతన పార్లమెంట్ భవనంలో 6.5 అడుగుల జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

New Parliament Building : నూతన పార్లమెంట్ భవనంలో 6.5 అడుగుల జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. 9500 కేజీల బరువున్న ఈ చిహ్నం పూర్తిగా కంచుతో తయారు చేశారు. అశోక చక్రం మీద నాలుగు సింహాలు ఉన్న ఈ చిహ్నాన్ని చాలా ఆకర్షనీయంగా తయారు చేశారు. బరువైన ఈ చిహ్నానికి కింద సపోర్టుగా 6వేల 500ల కేజీలతో స్టీల్‌తో బేస్‌మెంట్ వేశారు.

971 కోట్ల రూపాయలతో నూతన పార్లమెంటు భవనం నిర్మాణం జరుగుతోంది. రాబోయే శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో జరిగేలా పనులను వేగవంతం చేశారు. ఈ ఆరున్నర అడుగుల జాతీయ చిహ్నాన్ని 8 అంచుల పద్ధతిలో తయారు చేశారు. మొదట మట్టితో చేసి, తరువాత కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను జోడించి, అనంతరం కంచుతో పూర్తి డిజైన్ వచ్చేలా చేశారు. పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్న కార్మికులను కూడా ప్రధాని కలుసుకున్నారు.

Tags

Next Story