విడాకులు తీసుకున్న కూతురికి బ్యాండ్ బాజాతో స్వాగతం పలికిన తండ్రి..

విడాకులు తీసుకున్న కూతురికి బ్యాండ్ బాజాతో స్వాగతం పలికిన తండ్రి..
అల్లుడికి అడిగినవన్నీ ఇచ్చాడు.. అమ్మాయిని అపురూపంగా చూసుకుండాని భావించాడు.. కానీ అత్తారింటికి వెళ్లిన ఆర్నెల్లకే వారి అసలు స్వరూపం బయటపడింది.

అయినా భరించింది. మారతారేమో అని ఆశించింది. ఏనిమిదేళ్లు అలానే గడిపేసింది. ఇక కలిసి ఉండడం కష్టమనుకుందేమో తండ్రికి వివరించింది తన పరిస్థితిని. నీ జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానన్న తండ్రి అభిప్రాయానికి కట్టుబడి విడాకులు తీసుకోవడానికి ధైర్యం చేసింది.

తండ్రి అనిల్ కుమార్ సమాజంలో విడాకులు అంటే చిన్నచూపు చూసే వారిని ధిక్కరిస్తూ కూతురు ఉర్వి విడాకులను స్వాగతించాడు. ఉర్వి వరకట్న వేధింపులను ఎదుర్కొంది, ఢిల్లీలో కంప్యూటర్ ఇంజనీర్ అయిన తన భర్తతో 8 సంవత్సరాలు కలిసి జీవించింది. కానీ ఆతడి ఆగడాలు భరించలేక ౮ ఏళ్ల తరువాత విడాకులు తీసుకుంది, వారికి ఒక కుమార్తె ఉంది.

విడాకులకు సంబంధించిన సామాజిక అపకీర్తిని దూరం చేయడానికి , కాన్పూర్‌లోని ఒక రిటైర్డ్ ప్రభుత్వ అధికారి తన కుమార్తె విడాకులను వేడుకగా జరుపుకోవాలని భావించి ఆమెను ' బ్యాండ్ బాజా'తో ఇంటికి తీసుకువచ్చాడు . "మేము ఆమెను కొన్ని సంవత్సరాల క్రితం ఎలా పంపించాము. ఆమె కొత్తగా జీవితం ప్రారంభించే సమయం వచ్చింది" అని BSNLలో పనిచేసిన అనిల్ కుమార్ చెప్పారు. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్ కుమార్తె ఉర్వి (36) 2016లో కంప్యూటర్ ఇంజనీర్‌ని వివాహం చేసుకుంది.

ఉర్వి అత్తమామలు ఆమెను వరకట్నం కోసం వేధించారని, ఆ తర్వాత ఆమె ఫిబ్రవరి 28న విడాకులు తీసుకుంది. "నేను ఎనిమిదేళ్లుగా చిత్రహింసలు, దెబ్బలు మరియు అవహేళనలను భరించాను, కానీ చివరికి నేను విరిగిపోయాను" అని ఉర్వి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story