Opposition meeting : జూలై 17, 18 తేదీల్లో విపక్ష నేతల రెండో సమావేశం

Opposition meeting : జూలై 17, 18 తేదీల్లో విపక్ష నేతల రెండో సమావేశం
X
మోదీని గద్దె దించడమే లక్ష్యం

విపక్షాల రెండో సమావేశం ఈనెల 17, 18 తేదీల్లో బెంగళూరులో జరగనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనల మధ్య ఈ సమావేశం వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు.

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జరిగే సన్నాహకానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల సమావేశం రెండోసారి నిర్వహిస్తుంది.గత నెల 23న పాట్నాలో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన విపక్షాల సమావేశం జరగగా.. రెండ దఫా సమావేశాన్ని ఈనెలలో నిర్వహించాలని భావించారు. అందుకు తేదీలను కూడా వెల్లడించారు. కానీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో చీలిక కారణంగా బెంగళూరులో జరగాల్సిన విపక్షాల సమావేశాన్ని వాయిదా వేశారు.

బీహార్ శాసనసభ వర్షాకాల సమావేశాలు వచ్చే వారం జూలై 10న నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు జూలై 24 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇద్దరూ అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉంటారు. అందువల్ల సమావేశ తేది నిర్ణయించడంలో కాస్త ఆలోచించవలసి వచ్చింది. అలాగే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమవుతాయి ఆగస్టు 11 వరకు కొనసాగతాయి. ఈ తేదీలతో క్లాష్ అవ్వకుండా ఉండటం కోసం అందుకే ప్రతిపక్ష భాగస్వామ్య పార్టీలతో మాట్లాడి తదుపరి తేదీ నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

మహారాష్ట్రంలో ఎన్సీపీ పార్టీలో చీలిక సమయంలో విపక్షాల బెంగళూరు సమావేశంకు ప్రాధాన్యత ఏర్పడింది. కానీ, సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బిజెపి ఆశలు గండి కొట్టేందుకు విపక్షాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం విభేదాలు పక్కన పెట్టి ఒకే దారిలో ప్రయాణించాలని నిర్ణయించాయి. పాట్నాలో జరిగిన సమావేశంలో ఇదే అంశంపై నేతలు చర్చించారు. ఈ క్రమంలో విపక్ష కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ నేతలు గట్టిగా చెబుతున్నారు అయితే భవిష్యత్తు ప్రధాని అఖిలేష్ యాదవ్ అంటూ యూపీలో పోస్టర్లు వెలవడం ఆసక్తిగా మారింది. మరోవైపు తాను కూడా పిఎం రేసులో ఉన్నానని మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా పీఎం పదవి పై ఆశతో ఉన్నారని చర్చ జరుగుతోంది. మోడీ సర్కారుని గద్దె దించాలన్న ఉద్దేశంతోనే సమిష్టి వ్యూహరచన చేస్తున్నామని ఎన్సీపీ చీఫ్ శరత్ పవర్ ప్రకటించారు. ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని ధిక్కరించే అజిత్ పవర్ బిజెపి షిండే వర్గంలో చేరిపోయారు. కాబట్టి ఈ ఎఫెక్ట్తో విపక్షాల కూటమి భవిత ఎలా ఉండబోతోంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story