6 రాష్ట్రాల్లో 122 చోట్ల NIA దాడులు

X
By - Subba Reddy |17 May 2023 11:00 AM IST
నేజనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) బుధవారం తెల్లవారుజామున 4గంటల నుంచి 6 రాష్ట్రాల్లో 122 చోట్ల దాడులు నిర్వహిస్తోంది
నేజనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) బుధవారం తెల్లవారుజామున 4గంటల నుంచి 6 రాష్ట్రాల్లో 122 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్‌స్టర్స్ నివాసాల్లో, డ్రగ్‌స్మగ్లర్స్, టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్న వారి ఇళ్లల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తోంది. NIA బలగాలు అనుమానం ఉన్న వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే హరియానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. డజన్ల కొద్ది బలగాలతో ఎన్‌ఐఏ ఈ దాడులు నిర్వహిస్తోంది. దేశంలో జరుగుతున్న అసాంఘీక కార్యకలాపాలు అదుపు చేసే నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com