NIA Raids PFI : పీఎఫ్‌ఐ పై మరిన్ని రైడ్స్ చేస్తోన్న ఎన్ఐఏ..90 మందికి పైగా అరెస్ట్..

NIA Raids PFI : పీఎఫ్‌ఐ పై మరిన్ని రైడ్స్ చేస్తోన్న ఎన్ఐఏ..90 మందికి పైగా అరెస్ట్..
X
NIA Raids PFI : పాపులర్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా కుట్రలు NIA దాడుల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి

NIA Raids PFI : పాపులర్ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా కుట్రలు NIA దాడుల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో భాగంగా మరోసారి ఎన్‌ఐఏ, ఈడీ అధికారులు 8 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 90మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోం రాష్ట్రాల్లో ఇవాళ సంయుక్తంగా సోదాలు చేపట్టింది. ఇందులో కేంద్ర నిఘా సంస్థలతోపాటు.. ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు పాల్గొన్నారు.

అయితే దేశంలోని ఆరెస్సెస్‌, బీజేపీ అగ్ర నేతలే టార్గెట్‌గా PFI పెద్ద కుట్ర పన్నినట్లుగా ఎన్‌ఐఏ దర్యాప్తులో వెలుగుచూసింది. ఈమేరకు పీఎఫ్‌ఐ నేతల నుంచి అనేక కీలక అంశాలను సేకరించింది. నాగ్‌పుర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం పీఎఫ్‌ఐ టార్గెట్‌ లిస్ట్‌లో ఉందని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి.

దసరా ఉత్సవాల్లో మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని ఈ సంస్థ ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. వీరిని టార్గెట్‌ చేసుకుని దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. బీజేపీ, సంఘ్‌నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం.

Tags

Next Story