PFI Case : పీఎఫ్ఐ కేసులో ఎన్‌ఐఏ సంచలన రిపోర్ట్..

PFI Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో NIA రిమాండ్ రిపోర్ట్ TV5 చేతికి అందింది. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. PFI కార్యకర్తలతో కలిసి అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి ఉగ్ర కుట్రకు పన్నాగం వేశాడు. దేహదారుఢ్య పరీక్షల పేరుతో ఒక వర్గాన్ని టార్గెట్ చేసి.. కత్తులతో, ఐరన్ రాడ్లతో దాడి చేసేలా శిక్షణ ఇచ్చాడు. PFI కేడర్ పేరుతో కార్యకర్తలకు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
అబ్దుల్ ఖాదర్ అండ్ టీమ్ కలిసి భారత ప్రభుత్వంపైనా కుట్రకు పథకం పన్నారు. ఉద్వేగ పూరిత స్పీచ్‌లు, వీడియోలు చూపిస్తూ... ఒక వర్గంపై కక్ష పెరిగేలా ఉసిగొల్పారు. PFI కార్యకర్తలతో కలిసి న్యాయ వ్యవస్థ పైనా కుట్రకు ప్లాన్ చేసినట్లు NIA విచారణలో వెల్లడైంది.
PFI తన ఉగ్ర కార్యకలాపాల కోసం జనం నుంచి భారీ మొత్తంలో నిధులు సమకూర్చుకుంది. NIA అదుపులో ఉన్న నిందితులు అబ్దుల్ ఖాదర్, ఉస్మన్, ఇమ్రాన్, సమీర్‌లు... విచారణలో తమ ఉగ్ర కుట్రను అంగీకరించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు జరిగిన NIA సోదాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఏపీ, తెలంగాణలో కలిపి 50కి పైగా NIA బృందాలు... పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా టార్గెట్‌గా సోదాలు చేపట్టాయి. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి ఉగ్రకుట్ర డొంకంతా లాగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com