NIA : తెలంగాణ, ఏపీలో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు.. పీఎఫ్ఐ నేతలు అరెస్ట్..

NIA : తెలంగాణ, ఏపీలో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు.. పీఎఫ్ఐ నేతలు అరెస్ట్..
X
NIA : తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెంచిన NIA

NIA : తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెంచిన NIA..టెర్రర్‌ లింకులున్న నలుగురు కీలక వ్యక్తులు అరెస్ట్ చేసింది. భైంసాలో ఇద్దర్ని అదుపులోకి తీసుకుంది. 26మందిపై దేశద్రోహం కేసు నమోదైంది. పాపులర్‌ ఫ్రాంట్‌ ఆఫ్ ఇండియా టార్గెట్‌గా NIA సోదాలు కొనసాగుతున్నాయి. శిక్షణ శిబిరాల ముసుగులో PFI ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మత కలహాలు సృష్టించేందుకే ఈ ట్రైనింగ్ క్యాంపులు నడుస్తున్నట్లు చెప్పారు NIA అధికారులు.

ఇక తెలంగాణ, ఏపీలో కలిపి మొత్తం 48 బృందాలు సోదాలు చేస్తున్నాయి. ఐతే నంద్యాల, నెల్లూరు జిల్లాలో NIA అధికారుల్ని PFI కార్యకర్తలు అడ్డగించారు. అరెస్టులపై వాగ్వాదానికి దిగారు. ఏపీలో కడప, కర్నూలు, నెల్లూరు, నంద్యాల జిల్లాలో 23 బృందాలు సోదాలు జరుపుతున్నాయి. గుంటూరు జిల్లాలో మరో 2 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.

అటు గతంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు NIA అధికారులు. భైంసా అల్లర్లతో లింకులపై ఆరా తీస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో మరో 23 బృందాల. తనిఖీలు చేస్తున్నాయి. భైంసాలో ఇద్దర్ని అదుపులోకి తీసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

Tags

Next Story