Nipah Virus: పరిస్థితి సమీక్షించేందుకు కేరళకు కేంద్ర బృందం

Nipah Virus: పరిస్థితి సమీక్షించేందుకు కేరళకు  కేంద్ర బృందం
నీపా వైరస్ బారిన పడి ఇద్దరు మరణించినట్టు నిర్ధారణ

కేరళ రాష్ట్రంలో ప్రబలుతున్న నిపా వైరస్ కలవరం సృష్టిస్తోంది. ఇటీవల కోజీకోడ్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరు వ్యక్తుల మరణానికి నీపా వైరస్ కారణమని కేంద్రం తాజాగా నిర్ధారించింది మరో నలుగురికి ఈ వైరస్ సోకడంతో కేరళ ప్రభుత్వంతో పాటు కేంద్రం అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాంతకంగా మారిన నిపా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో కేరళ రాష్ట్రానికి కేంద్ర వైద్యనిపుణుల బృందం వచ్చింది. కోజికోడ్ నగరంలో ఈ వైరస్ ప్రభావంతో 12 ఏళ్ల బాలుడు మరణించడంతో ఆరోగ్య కార్యకర్తలు పరిసర ప్రాంతాల్లోని మేకల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు. పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పరీక్ష కోసం పంపిన ఐదు నమూనాల్లో మూడు పాజిటివ్‌గా వచ్చాయని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

నిపా వైరస్ వ్యాప్తిని పరిష్కరించడానికి కేరళ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుందని జార్జ్ చెప్పారు. కోజికోడ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నాటికి 160 మందికి పైగా హైరిస్క్ వ్యక్తుల కాంటాక్ట్ లిస్ట్‌ను వైద్యాధికారులు రూపొందించారు. వారిని వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ వైరస్ వల్ల మరణించిన బాలుడి కుటుంబం పరిసరప్రాంతాల్లోని ఇళ్లలో ఫీవర్ సర్వే నిర్వహించారు. సకాలంలో నిపా వైరస్ ను గుర్తించడం వల్ల దాన్ని నివారించవచ్చని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సీనియర్ అధికారి చెప్పారు.


మెదడుకు హాని కలిగించే ప్రాణాంతక వైరస్ సోకిన గబ్బిలాలు, పందులు,ఇతర వ్యక్తుల శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. నిపా వైరస్ పాజిటివ్ అని తేలిన మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మరోవైపు, కేరళలో పరిస్థితిని సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేసేందుకు కేంద్ర బృందం కేరళకు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ తాజాగా ఓ ప్రకటన చేశారు.

నీపా వైరస్ కారణంగా తొలి మరణం ఆగస్టు 30న సంభవించగా మరో వ్యక్తి సోమవారం కన్నుమూశారు. రాష్ట్రంలో నీపా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని, దీని వల్ల ఇద్దరు మరణించారు. మొత్తం నలుగురి శాంపిళ్లు పరీక్షలకు పంపించగా ఇద్దరికి నీపా వైరస్ సోకినట్టు తేలింది. మరో ఇద్దరికి రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.

అయితే నీపాకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగింన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ప్రజలు మాస్కులు ధరించాలని సూచించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story