Nirmala Sitharaman: బడ్జెట్ తర్వాత విద్యార్థులతో మంత్రి నిర్మల భేటీ..

Nirmala Sitharaman: బడ్జెట్ తర్వాత విద్యార్థులతో మంత్రి నిర్మల భేటీ..
X
లోక్ సభ గ్యాలరీలో కూర్చుని ప్రత్యక్షంగా బడ్జెట్ ప్రసంగం విన్న విద్యార్థులు

కేంద్ర బడ్జెట్ తయారీ విధి విధానాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 30 మంది విద్యార్థులకు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి మొత్తం 30 మందిని ఎంపిక చేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు లోక్ సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని వారు ప్రత్యక్షంగా వినే అవకాశం కల్పించారు. లోక్ సభ గ్యాలరీలో కూర్చుని ప్రసంగం వినే అవకాశం వారికి కల్పించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

బడ్జెట్ ప్రసంగం తర్వాత విద్యార్థులకు కర్తవ్య భవన్‌ లోని ఆర్థిక మంత్రిత్వ శాఖను సందర్శించే అవకాశం కల్పించినట్లు వివరించాయి. ఆర్థిక శాఖ పనితీరు, విధాన రూపకల్పన ప్రక్రియలు, అత్యున్నత స్థాయిల్లో ఆర్థిక నిర్ణయాలు ఎలా రూపొందిస్తారు, అమలు చేస్తారు అనే విషయాలను ఆ విద్యార్థులు తెలుసుకోనున్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విద్యార్థులతో సమావేశమై.. బడ్జెట్‌ పై వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకుంటారని సమాచారం.

పరిపాలనకు సంబంధమైన విషయాలపై విద్యార్థుల్లో అవగాహన తీసుకురావడానికి కేంద్రం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విద్యార్థులతో సమావేశమై.. బడ్జెట్‌పై వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకోనున్నారు.

Tags

Next Story