బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్.. ఉపముఖ్యమంత్రిగా సుశిల్ మోదీ..

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్.. ఉపముఖ్యమంత్రిగా సుశిల్ మోదీ..

బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఆదివారం పాట్నాలోని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసంలో ఎన్‌డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నితీశ్ కుమార్ ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే సమయంలో సుశిల్ మోదీ పేరును ఉపముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఎమ్మెల్యే తార్కిషోర్ ప్రసాద్ బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. అదే సమయంలో రేణుదేవిని ఉపనేతగా ఎంపిక చేశారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు ఎన్‌డీఏ నేతలు.

Tags

Next Story