Nitish Kumar: ఎన్డీయేకి షాకిచ్చిన నితీష్‌ కుమార్‌.. సీఎం పదవికి రాజీనామా..

Nitish Kumar: ఎన్డీయేకి షాకిచ్చిన నితీష్‌ కుమార్‌.. సీఎం పదవికి రాజీనామా..
Nitish Kumar: అనుకున్నదే జరిగింది.. ఎన్డీయేకు జేడీయూ ఊహించని షాక్‌ ఇచ్చింది..

Nitish Kumar: అనుకున్నదే జరిగింది.. ఎన్డీయేకు జేడీయూ ఊహించని షాక్‌ ఇచ్చింది.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్‌ కుమార్‌ బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.. దీంతో బిహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.. అయితే, కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో బీజేపీ స్థానంలో ఆర్జేడీ వచ్చి చేరనుంది.. కొద్దిసేపటి క్రితమే గవర్నర్‌ను కలిశారు నితీష్‌ కుమార్‌.. జేడీయూ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు ర్యాలీగా వెళ్లిన నితీష్‌ కుమార్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్‌కు తెలిపారు.. రాజీనామా లేఖను ఆయనకు అందజేశారు.. బీజేపీ జేడీయూకు కనీస గౌరవం ఇవ్వడం లేదని నితీష్ కుమార్ కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.. బీజేపీ తమను బలహీనం చేసే ప్రయత్నం చేస్తోందని దీనిపై పార్టీ సభ్యులందరితో చర్చించామని.. సభ్యులందరి ఆకాంక్ష మేరకే ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్లు నితీష్‌ మీడియాకు వివరించారు..

బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.. దీనికి సంబంధించి తనకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఆ లేఖను గవర్నర్‌కు అందజేశారు.. ఆర్జేడీ మద్దతుదారుల లేఖను కూడా దీనికి జత చేశారు.. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే నితీష్‌ కుమార్‌కు ముఖ్యమంత్రి పదవి, తేజస్వి యాదవ్‌కు హోంశాఖతోపాటు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేలా ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లుగా ప్రచారం జరుగుతోంది..

అటు స్పీకర్‌ పదవి కూడా ఆర్జేడీకే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.. కాదు, కాంగ్రెస్ కు స్పీకర్ ఇచ్చే ఛాన్స్ ఉందని అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఇక గవర్నర్‌తో భేటీ తర్వాత రబ్రీ దేవి ఇంటికి వెళ్లారు నితీష్ కుమార్.. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు, పదవుల పంపకంపై తేజస్వి యాదవ్ తో చర్చిస్తున్నారు.. ఈ భేటీ తర్వాత తేజస్వి యాదవ్ తో కలిసి మరోసారి గవర్నర్ ను కలవనున్నారు నితీష్ కుమార్.. ఇక ఇదే విషయమై ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనికి కూడా కలుస్తారనే ప్రచారం జరుగుతోంది..

Tags

Read MoreRead Less
Next Story