నివర్‌ తుఫాను : చెన్నైలో భారీ వర్షాలు

నివర్‌ తుఫాను : చెన్నైలో భారీ వర్షాలు
X

నివర్‌ తుఫాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత కారణంగా చంబరపాకం రిజర్వాయర్‌ నిండటంతో... అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీజలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో.... ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2015లో చంబరపాకం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో మహానగరం నీట మునిగింది. ఇప్పుడు మళ్లీ రిజర్వాయర్ నిండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story