తెల్లవారుజామున తీరం దాటిన నివర్ తుఫాన్

తెల్లవారుజామున తీరం దాటిన నివర్ తుఫాన్

ప్రచండ గాలులతో నివర్ తుఫాన్ ... అతలాకుతలం చేస్తోంది. తమిళనాడులోని కరైకల్‌ - మహాబలిపూరం వద్ద ఈ తెల్లవారుజామున తీరం దాటింది. అతి తీవ్ర తుపానుగా మారిన... నివర్‌.... మొత్తం మూడు గంటల్లో తీరం దాటినట్లు తెలిపారు వాతావరణశాఖ అధికారులు. తుఫాన్‌ తీరం దాటుతున్న సమయంలో.. భారీగా ఈదురు గాలులు, వర్షాలతో.. తీవ్ర నష్టం సంభవించింది. ఇక తీరం దాటాక 6 గంటల పాటు భీకరంగా మారుతుందంటున్నారు ఐఎండీ అధికారులు. ఇప్పటికే పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.. పలు చోట్ల కరెంట్ పోల్స్‌ సైతం విరిగిపడ్డాయి. పంటలు నీట మునిగాయి.

నివర్ తుపాన్.. తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే చెన్నైలో కుండపోత కురుస్తోంది. భారీ వర్షాలతో.. అక్కడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం అస్థవ్యస్తమైంది. లోతట్టుప్రాంతాలు జలమయం కావడంతో... అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తుపాన్ కారణంగా విమానాలు, రైళ్లు నిలిచిపోయాయి.

ఏపీలోని పలు జిల్లాలో భారీనుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. తిరుమల తిరుపతిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో, చెట్లు, హోర్డింగ్‌లు నెలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు తిరుమలలోని బాలాజీ నగర్‌లో రాత్రంతా కరెంట్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బుందులు పడుతున్నారు.

తుపాన్ తీరాన్ని దాటుతున్న సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 145 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. దీనికారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇక ఇవాళ చిత్తూరు, కర్నూలు,ప్రకాశం, కడప జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ ఎఫ్‌ బృందాలను సిద్దంచేశారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story