PM Modi: ఇల్లు లేదు.. కారు లేదు.. అయినా సరే మోదీ ఆస్తులు ఎంతంటే..?

తనకు 3 కోట్ల 2 లక్షల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని... తనకు సొంత ఇళ్లు, భూమి, కనీసం కారు కూడా లేదని వెల్లడించారు. తన వద్ద 52 వేల 920 రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు..Look..
ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తనకు 3 కోట్ల 2 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో మోదీ పేర్కొన్నారు. 52 వేల 920 రూపాయల నగదు తన వద్ద ఉన్నట్లు పత్రాల్లో మోదీ వెల్లడించారు. సొంత భూమి, ఇళ్లు, కారు తనకు లేవని స్పష్టం చేశారు. మోదీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 11 లక్షలు ఉండగా.. అది 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 23.5 లక్షలు అయ్యింది. ఈ క్రమంలోనే ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ కూడా ప్రధాని ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చారు. తన సెల్ నంబర్ 8980809224 అని.. ఈ మెయిల్ ఐడీ narendramodi@narendramodi.in అని పేర్కొన్నారు.
ప్రధాని మోదీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 ఖాతాలు ఉన్నాయి. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్ ఖాతాలో 73వేల 304 రూపాయల డిపాజిట్ ఉండగా,. వారణాసి బ్రాంచ్‌లో 7వేలు మాత్రమే ఉన్నాయి. అయితే ఎస్‌బీఐలో మోదీ పేరిట.. 2 కోట్ల 85 లక్షల 60వేల 338 రూపాయల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నట్లు తెలిసింది.2 లక్షల 67వేల 750 రూపాయల విలువైన 4 బంగారు ఉంగరాలు మోదీకి ఉన్నాయి. 2014లో తొలిసారిగా వారణాసి నుంచి ఎన్‌డిఎ అభ్యర్థిగా మోదీ పోటీ చేశారు. మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాలనుకుంటున్న మోదీ.. ఈసారి మళ్లీ వారణాసి స్థానం నుంచే నామినేషన్ దాఖలు చేశారు. ఏడో విడతలో భాగంగా.. జూన్ 1న వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com