Air ticket refund rules: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోపు టికెట్ క్యాన్సల్ చేస్తే అదనపు చార్జీల్లేవ్ !

X
మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా టికెట్‌ రద్దు చేసే నిబంధనల్లోనూ డీజీసీఏ సవరణలు

విమాన ప్రయాణికుల చిరకాల వాంఛ నెరవేరింది. టికెట్ బుక్ చేసిన తర్వాత ప్లాన్ మారినా లేదా పొరపాట్లు జరిగినా భారీగా జరిమానాలు వసూలు చేసే విమానయాన సంస్థల ధోరణికి పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) చెక్ పెట్టింది. ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూర్చేలా విమాన టికెట్ల రీఫండ్ మరియు సవరణ నిబంధనలను (సీఏఆర్) సవరిస్తూ ఫిబ్రవరి 24న డీజీసీఏ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 48 గంటల్లోగా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, పేరు మార్చుకున్నా ఎలాంటి ఛార్జీలు కట్టాల్సిన పని లేదు.

48 గంటల్లో చేస్తే ఎలాంటి చార్జీలు ఉండవు!

కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు తమ విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే రద్దు చేసుకోవచ్చు. లేదంటే ప్రయాణ తేదీలను మార్చుకోవచ్చు. అయితే ఇది కొన్ని నిర్దిష్ట షరతులకు లోబడి ఉంటుంది. సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎయిర్‌లైన్స్ సగం ధరకు పైగా జరిమానాగా కోత విధిస్తాయి. కానీ తాజా సవరణతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.

Tags

Next Story