ఆలయాలను సందర్శించే భక్తులకూ డ్రెస్ కోడ్..

రాజస్థాన్ ఆలయాన్ని సందర్శించే భక్తుల కోసం డ్రెస్ కోడ్‌ను తీసుకువచ్చింది ప్రభుత్వం. చిరిగిన జీన్స్, మినీ స్కర్టులతో ఆలయాన్ని సందర్శించడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని భక్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో కమిటీ ఈ ఆదేశాలను ఆమోదించిందని ఆలయ అధ్యక్షుడు జయప్రకాశ్ సోమాని తెలిపారు.
రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలోని ఒక ప్రముఖ ఆలయం భక్తుల కోసం డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. పుణ్యక్షేత్రాన్ని సందర్శించేటప్పుడు షార్ట్‌లు, మినీ స్కర్ట్స్, ఫ్రాక్స్, రిప్డ్ జీన్స్ ,నైట్ సూట్‌లను ధరించకుండా ఉండాలని కోరింది. జార్ఖండ్ మహాదేవ్ ఆలయ కమిటీ ఆలయ ప్రాంగణం వెలుపల ఒక బ్యానర్‌ను ఉంచింది, “పొట్టి బట్టలు ధరించిన వ్యక్తులు మందిరం లోపలికి అనుమతించబడరు. వారు ప్రాంగణం వెలుపల నుండి ప్రార్థనలు చేయాలి” అని రాసి ఉంది.
ఆలయాన్ని సందర్శించేటప్పుడు పురుషులు, స్త్రీలు సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ నిర్వాహకులు ఉద్ఘాటించారు. పలు ఆలయాలు డ్రెస్ కోడ్ ఆంక్షలను అమలు చేయడం గమనార్హం. బోహ్రా గణేష్‌జీ, చర్భుజ ఆలయాల వెలుపల కూడా ఇలాంటి నోటీసులు పోస్ట్ చేయబడ్డాయి. సందర్శకులు హిందూ సంస్కృతిని అనుసరించేందుకే ఆలయం వెలుపల నోటీసులు పెట్టినట్లు ఉదయ్‌పూర్ ధర్మోత్సవ్ సమితి అధ్యక్షుడు దినేష్ మక్వానా తెలిపారు.
సందర్శకులు నిషేధిత దుస్తులు ధరించి వస్తే మార్చుకునేందుకు వీలుగా చీరలు, ధోతులు, భారతీయ దుస్తులతోపాటు దుస్తులు మార్చుకునే గదులను ప్రాంగణంలో అందుబాటులో ఉంచుతున్నట్లు జగదీష్ ఆలయ పూజారి పరిషత్ కార్యాలయ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ 'బావే వాలీ మాతా' ఆలయ నిర్వాహకులు ఇటీవల సందర్శకుల కోసం డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com