Siddhivinayak Temple: డ్రస్ కోడ్ ప్రకటించిన సిద్ధివినాయక్ గణపతి ఆలయ ట్రస్ట్

ముంబై లోని ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్త ప్పనిసరి చేశారు. స్కర్ట్స్, శరీరం అంతా కనిపించేలా ఉండే దుస్తులు ధరించడంపై నిషేధం విధించారు. ఆలయానికి వచ్చే భక్తులు శరీరాన్ని కప్పిఉంచే సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలని శ్రీ సిద్ధి వినాయక గణపతి ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది.
పొట్టి పొట్టి దుస్తులు, ప్యాంటు షర్ట్స్, చిరిగిన ప్యాంట్లు వంటి దుస్తులు ధరించి ఆలయానికి వచ్చే వారిని అనుమతించబోమని తెలిపింది. పూజల సమయంలో కొందరు అగౌరవంగా భావించే అభ్యంతరకరమైన దుస్తులు ధరించి రావడంపట్ల పలువురు భక్తులు ఆందోళన వ్యక్తం చేశారని ఆలయ అధికారులు తెలిపారు. వారి ఫిర్యాదుల మేరకు ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భక్తులు తప్పనిసరిగా ఆలయ నియమ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. చాలా మంది సందర్శకులు పూజా స్థలంలో అగౌరవంగా వస్త్రధారణ ధరించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారని ట్రస్ట్ తెలిపింది. పదేపదే అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత.. ఆలయ ట్రస్ట్ ఆలయ పవిత్రతను కాపాడేందుకు దుస్తుల కోడ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. భక్తులందరూ తమ సందర్శన సమయంలో సౌకర్యవంతంగా ఉండేలా మరియు ఆలయ ప్రాంగణంలో అలంకారాన్ని కొనసాగించడానికి డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెడుతున్నట్లు ట్రస్ట్ స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com