Doremon: డోరెమాన్‌కు వాయిస్ ఇచ్చిన నటి మృతి

మీరు యానిమేటెడ్ కార్టూన్‌లలో ఒకటైన డోరెమాన్ చూస్తారా? అందులో డోరెమాన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది కదూ. షుజుకా, నోబితా తమ అల్లరి చేష్టలతో ప్రమాదంలో పడినపుడు డోరెమాన్ వారిని సేవ్ చేస్తూ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా ఆ డోరెమాన్ వాయిస్ పిల్లలను బాగా నవ్విస్తుంది. . ఈ ప్రోగ్రామ్ చిన్న పిల్లలదే అయినా.. వారితో పాటు పెద్దవాళ్లు కూడా చూసి ఆనందిస్తుంటారు. ముఖ్యంగా ఇందులో నోబితా-డోరేమాన్ కాంబినేషన్ విచిత్రంగా ఉంటుంది. నోబితా స్నేహితులతో ఇబ్బందులు పడినప్పుడల్లా డోరేమాన్ గ్యాడ్జెట్స్ కోసం బతిమాలుతో ఉంటాడు. ఏదొకటి ఇచ్చేదాకా వదిలిపెట్టడు. ఇలా డోరేమాన్ కార్యక్రమం చిన్నారులను ఆకట్టుకునేలా సాగిపోతుంది.
పిల్లి రూపాన్ని పోలియున్న డోరేమాన్ వాయిస్ అందించే ఆర్టిస్ట్ నోబుయో ఒయామా తుదిశ్వాస విడిచింది. సెప్టెంబర్ 29న మృతి చెందినప్పటికీ ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. డోరేమాన్ వాయిస్‌ను ఒయామానే అందిస్తుంది. ఈ వాయిస్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. నోబుయో ఒయామా జపాన్‌కు చెందిన మహిళ. వృద్ధాప్య సంబంధ కారణాల వల్ల ఆమె కన్నుమూశారు. ఆమె వయస్సు 90 సంవత్సరాలు. గత నెల 29న అనారోగ్య సమస్యలతో నోబుయో ఒయామా మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం (11-10-2024) ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డోరేమాన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోరేమాన్ అంటే ఒయామానే గుర్తుకు వస్తుందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 2005 వరకు నోబుయో డోరేమాన్ పాత్రకు డబ్బింగ్ అందించారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా నోబుయో 1933లో జన్మించారు. 1960లో ఆమె తన కెరీర్ స్టార్ట్ చేశారు. సినిమాలు, సిరీస్‌లు, పలు షోలలో వివిధ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. అనంతరం 1964లో సహ నటుడైన కీసుకే సగావాను మ్యారేజ్ చేసుకున్నారు. ఆపై 1979లో డోరెమాన్ ప్రారంభం అయింది. ఇక అప్పటి నుంచి 2005 వరకు ఆమె డోరెమాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఆ తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకుని 2010లో హిట్ వీడియో గేమ్ సిరీస్ డంకన్‌రోన్పాలో మోనోకుమార్ పాత్రకు వాయిస్ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com