Porn Racket: Porn Racket: నోయిడాలో పోర్న్ రాకెట్ గట్టు రట్టు..

Porn Racket: Porn Racket: నోయిడాలో పోర్న్ రాకెట్ గట్టు రట్టు..
X
అంతర్జాతీయంగా లింకులు ఉన్నట్లు గుర్తించిన ఈడీ..

నోయిడాలో బడా వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. ఈ రాకెట్‌ గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ED) రట్టు చేసింది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ వ్యభిచార రాకెట్‌ నడుపుతున్న ముఠాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. నోయిడాలోని ఓ ఇంటిపై దాడిచేసి రూ.15.66 కోట్ల అక్రమ విదేశీ నిధుల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నోయిడాలో ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ గత ఐదేళ్లుగా వ్యభిచార రాకెట్‌ నడుపుతున్నారు. ఈ జంట సైప్రస్‌కు చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో సంబంధాలు కలిగి ఉంది. ఈ టెక్నియస్ లిమిటెడ్ సంస్థ ఎక్స్ హామ్‌స్టర్, స్ట్రిప్‌చాట్ లాంటి ప్రసిద్ధ శృంగార వెబ్‌సైట్‌లను నిర్వహిస్తోంది. వీరిద్దరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ప్రధానంగా ఫేస్‌బుక్ ఉపయోగించి మోడల్‌లను నియమించుకుంటారు.

మంచి జీతాలు ఇస్తామనే హామీలతో మోడలింగ్ అవకాశాలు అందిస్తామని ‘ఎచాటో డాట్ కామ్’ అనే పేజీని క్రియేట్ చేశారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా వీరి వలలో చిక్కారు. ఆడిషన్స్‌ కోసం నోయిడాలోని ఆ ప్లాట్‌కు వచ్చిన తర్వాత, వారికి డబ్బు ఆశ చూపి రాకెట్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఒప్పుకున్న వారికి నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జీతం ఇచ్చారు.

ఈ జంట తమ ఫ్లాట్‌లో ఒక ప్రొఫెషనల్ వెబ్‌క్యామ్ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు దాడి చేసిన సమయంలో గుర్తించారు. అడల్ట్ కంటెంట్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వినియోగదారులు చేసే చెల్లింపుల ఆధారంగా మోడల్స్ టాస్క్‌లను చేసేవారు. హాఫ్-ఫేస్ షోలు, ఫుల్-ఫేస్ షోలు, వివిధ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు టోకెన్‌లను కొనాల్సి ఉంటుంది.

కేటగిరీని బట్టి ఛార్జీలు మారుతుంటాయి. వచ్చిన ఆదాయంలో 75 శాతం దంపతులు ఉంచుకుంటారు. మిగతా 25 శాతం మోడల్స్‌కు ఇస్తారు. టెక్నియస్ లిమిటెడ్ సంస్థ ద్వారా రూ.7 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసిన నెదర్లాండ్‌లోని ఒక బ్యాంక్ అకౌంట్‌ని ఈడీ కనిపెట్టింది. ఈ నిధులను భారతదేశంలో ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు ఉపయోగించి విత్ డ్రా చేసుకున్నారు. ఈ రాకెట్‌లో వేలాది మంది మహిళలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Tags

Next Story