Traffic E Challan: చలాన్ కట్టకుంటే లైసెన్స్ రద్దు!

కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చిన నేపథ్యంలో పెండింగ్ ఈ-చలాన్లు ఉన్న వాహనదారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. తమపై ఉన్న పెండింగ్ జరిమానాలను మూడు నెలల్లో చెల్లించని వారి డ్రైవింగ్ లెసెన్సులు సస్పెండ్ అవుతాయని స్పష్టంచేసింది. దీనికి అదనంగా ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్సు కనిష్ఠంగా మూడు నెలలపాటు సస్పెన్షన్‌కు గురవుతుంది. ప్రస్తుతం 40 శాతం మాత్రమే ఉన్న ఈ-చలాన్ రికవరీ రేటును పెంచాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ కఠిన చర్యలను తీసుకువచ్చింది.
ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. చెల్లించని ఈ-చలాన్లను వాహన ఇన్సూరెన్సు ప్రీమియంలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రెండు పెండింగ్ జరిమానాలు ఉన్న డ్రైవర్.. వాహన ఇన్సూరెన్సును ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘనలను మరింత సమర్థంగా పసిగట్టేందుకు మోటారు వాహనాల చట్టంలోని 136ఏ సెక్షన్ కింద ఆధునిక టెక్నాలజీని అధికారులు ఉపయోగించుకోనున్నారు. ఇందులో సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ గన్లు, బాడీ-వార్మ్ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తించే వ్యవస్థలు వంటివి ఉన్నాయి.
తాజా నిబంధనల ప్రకారం మూడు నెలలలోపు తమ ట్రాఫిక్ ఇ-చలాన్ (జరిమానా) చెల్లించని వారు త్వరలో డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు చలాన్లు ( సిగ్నల్ జంపింగ్ లేదా ర్యాష్ డ్రైవింగ్) పడినా కనీసం మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అవుతుంది.సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను అమలు చేయాలని దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇటీల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ట్రాఫిక్ నిర్వహణ కోసం అధునాతన టెక్నాలజీలను ఉపయోగించాలని ఈ చట్టంలోని సెక్షన్ 136A చెబుతుంది. స్పీడ్ ట్రాకింగ్, సీసీటీవీ కెమెరాలు, స్పీడ్ గన్స్, బాడీ వార్న్ కెమెరాలు, ఆటోమేటిక్ నెంబరు ప్లేట్ గుర్తింపు వ్యవస్థ వంటివి ఏర్పాటు చేయాలి. దీనివల్ల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిని గుర్తించడం సులభం అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com