Madras High Court: తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు షాక్‌

Madras High Court:  తల్లిదండ్రులను పట్టించుకోని  పిల్లలకు షాక్‌
కన్నవాళ్ల బాగోగులు విస్మరిస్తే ఆస్తి వెనక్కి తీసుకోవచ్చన్న మద్రాస్ హైకోర్టు

ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్‌ హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. తల్లిదండ్రులు తమ ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి వెనక్కి తీసుకోవచ్చునని సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు రాసే సెటిల్‌మెంట్‌ దస్తావేజులో ప్రేమ, ఆత్మీయతలతో ఆస్తిని ఇస్తున్నట్లు పేర్కొంటే, ఆ పిల్లలు తమకు హామీ ఇచ్చిన విధంగా తమ సంరక్షణ బాధ్యతలను నెరవేర్చకపోతే, ఆ ఆస్తిని నిర్మొహమాటంగా , ఏకపక్షంగా తిరిగి ఆ తల్లిదండ్రులు తీసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది.


పిల్లలు వారి తల్లిదండ్రులకు ఆహారం, ఆశ్రయం కల్పించడమే కాకుండా వారు సురక్షితంగా, గౌరవంగా సాధారణ జీవితాన్ని గడపాలని నిర్దారించడం పిల్లల బాధ్యత అని ధర్మాసనం పేర్కొంది. తిరుపూర్ ఆర్డిఓ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థిస్తూ ఓ మహిళకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తల్లిదండ్రులను కాపాడుకోవల్సిన బాధ్యత, అలాంటి తల్లిదండ్రులను అవసరాలకు కూడా సాధారణ జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను కాపాడుకోవడం పిల్లల బాధ్యత అని కోర్టు పేర్కొంది.

కేసు వివరాల్లోకి వెళితే ..

తమిళనాడులోని తిరుపూర్ లో నివాసం ఉంటున్న షకీరా బేగం తన కుమారుడు మహమ్మద్ దయాన్ పేరుమీద కొంత ఆస్తిని రాసింది. అయితే కుమారుడు తన బాగోగులను పట్టించుకోవడం లేదని షకీరా బేగం సబ్ రిజిస్ట్రార్ ను ఆశ్రయించింది. తనను బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో తన పేరుమీదున్న ఆస్తిని తన కుమారుడికి ఇచ్చానని ఇప్పుడు తన కొడుకు తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని తాను రాసిన్ సెటిల్ మెంట్ డీడ్ ను రద్దు చేయాలని కోరింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ ఈ డిడ్ రద్దు చేశారు. ఆ నిర్ణయాన్ని ఆమె కొడుకు మహ్మద్ దయాన్ సవాల్ చేశారు. తన తల్లి సెటిల్ మెంట్ డీడ్ ను ఎలాంటి షరతులు లేకుండా రాసినట్లు తెలిపారు. కానీ దయాన్ వాదనలు కోర్టు తోసిపుచ్చింది. బాధిత తల్లిదండ్రులు ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది.

Tags

Read MoreRead Less
Next Story