Fauja Singh: కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్‌ ఫౌజా సింగ్‌ మృతి..

Fauja Singh: కారు ఢీకొని ప్రముఖ అథ్లెట్‌ ఫౌజా సింగ్‌ మృతి..
X
నిందితుడు ఎన్నారై అరెస్ట్

టర్బన్డ్ టోర్నడోగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ అథ్లెట్‌ ఫౌజా సింగ్(114) సోమవారం జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో మరణించారు. జలంధర్-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై కారు ఢీకొని ఫౌజా సింగ్ కన్నుమూశారు. అయితే ఫాజా సింగ్‌ను ఢీకొట్టిన కారును గుర్తించినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని సొంత గ్రామం దగ్గర రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. దీంతో తలకు గాయం అయింది. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ కారు కెనడాలో స్థిరపడ్డ ఎన్నారై అమృత్‌పాల్ సింగ్ ధిల్లాన్‌(30)దిగా గుర్తించి రెండు రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. పంజాబ్‌లో రిజిస్టర్ చేయబడిన టయోటా ఫార్చ్యూనర్ కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫౌజా సింగ్‌ .. ప్రపంచంలోనే కురువృద్ధ అథ్లెట్‌గా పేరుగాంచారు. వందేండ్లకు పైగా వయసు కలిగినా ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ మారథాన్‌లో సత్తాచాటారు. ఫౌజా సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోడీ, ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి ప్రకటించాయి. 1911 ఏప్రిల్‌ 1న జన్మించిన ఫౌజాసింగ్‌ 89 ఏండ్ల వయసులో అథ్లెటిక్స్‌ కెరీర్‌ మొదలుపెట్టారు. 1993లో ఇంగ్లండ్‌కు వెళ్లిన అథ్లెట్‌.. ‘టర్బన్‌ టోర్నడో’ అంటూ అందరి మనన్నలు పొందారు. 2011లో జరిగిన టొరంటో మారథాన్‌లో 100 ఏండ్ల వయసులో 8 గంటల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు.

Tags

Next Story